Kavitha: రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన కవిత.. మే 6న కోర్టు నిర్ణ‌యం వెల్ల‌డి..!

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత మ‌రోసారి రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.

  • Written By:
  • Updated On - May 4, 2024 / 10:08 AM IST

Kavitha: ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత (Kavitha) మ‌రోసారి రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కోర్టుకు నేరుగా హాజరుప‌ర్చాల‌ని, వీడియో కాన్ఫరెన్సు వద్దంటు కోర్టుకు కవిత విన్న‌వించుకున్నారు. ఈమేర‌కు కోర్టులో క‌విత త‌రుఫున న్యాయ‌వాది అప్లికేష‌న్ దాఖ‌లు చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన క‌విత ప్ర‌స్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.

మే 7వ తేదీతో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియ‌నుంది. గతంలో కస్టడీ ముగిసిన సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజ‌రుప‌ర్చారు జైలు అధికారులు. కవిత పిటిషన్ పై ఆరవ తేదీన తన నిర్ణయాన్ని న్యాయమూర్తి వెల్ల‌డించ‌నున్నారు. కోర్టుకు హాజరైన సందర్భంగా కవిత కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉంటుంది.

గతంలో కోర్టులో మీడియాతో క‌విత మాట్లాడ‌టంపై రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. అందుకే తదుపరి విచారణ వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులు హాజ‌రుప‌ర్చారు. చివరిగా ఏప్రిల్ 14న కవిత కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఏప్రిల్ 23న కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు జైలు అధికారులు హాజ‌రుప‌ర్చారు. ఏప్రిల్ 23వ తేదీన మరో 14 రోజులు అంటే మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. మార్చి 15న కవితను హైదరాబాదులో ఈడీ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. మార్చి 16వ తేదీన కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుప‌ర్చారు.

Also Read: ICC T20 World Cup 2024: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొన‌బోయే ముఖ్య‌మైన‌ జ‌ట్ల వివ‌రాలివే..!

పది రోజులఈడీ కస్టడికి ఇస్తూ అనుమతించిన రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్ట్. మార్చి 26 తో ముగిసిన కవిత 10 రోజుల ఈడీ కస్టడీ. ఈడీ కస్టడీ అనంతరం 14 రోజుల జ్యూడిషల్ కస్టడీ ఏప్రిల్ 9 వరకు కోర్టు విధించింది. కస్టడీలో ఉండగానే ఏప్రిల్ ఆరవ తేదీన తీహార్ జైల్లో కవితను సీబీఐ విచారించింది. కోర్టు అనుమతితో 11వ తేదీన కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. 12వ తేదీన కోర్టులో న్యాయమూర్తి ముందు కవితను సీబీఐ హాజ‌రుప‌ర్చింది.

We’re now on WhatsApp : Click to Join

మూడు రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమ‌తినిచ్చింది. కవిత కస్టడీ ముగియడంతో ఏప్రిల్ 14వ తేదీన కోర్టులో సీబీఐ మ‌రోసారి హాజ‌రుప‌ర్చింది. ఏప్రిల్ 8వ తేదీన ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఏప్రిల్ 22వ తేదీన సీబీఐ, ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు. మే ఆరవ తేదీన ఢిల్లీ లిక్కర్ పాలసీలో సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ పిటిషన్ పై రౌజ్ రెవెన్యూ కోర్ట్ న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు ఇవ్వ‌నున్నారు.