Site icon HashtagU Telugu

Telangana: మధురై కోర్టుకు హాజరైన పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి

Telangana

Telangana

Telangana: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోటుపాట్లను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్. ఈ క్రమంలో గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కోర్టు మెట్లెక్కారు.

మధురై కోర్టుకు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి,సుధీర్ రెడ్డి. వీరిద్దరూ అక్కడి కోర్టు ఆవరణలో కూర్చుని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలపై అతను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పరువు నష్టం చేశారని తన స్వస్థలం పరిధిలోకి వచ్చే మధురై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు హాజరు కావాలని గతంలో కోర్టు సమన్లు జారీ చేసింది. కానీ ఎమ్మెల్యేలు ఇద్దరూ పట్టించుకోకపోవంతో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఈ క్రమంలో వారిద్దరూ వెంటనే కోర్టుకు హాజరయ్యారు.

మాణిక్కం ఠాగూర్ తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మాణిక్కం ఠాగూర్ రూ.500కోట్లు తీసుకుని రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా చేశారని ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో వాళ్ళిద్దరిపై మాణిక్కం ఠాగూర్ పరువు నష్టం దావా వేశారు. అయితే కేసుని ఏ మాత్రం పట్టించుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మదురై కోర్టు సమన్లు జారీ చేసింది. నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ నేపథ్యంలో అరెస్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. దీంతో చేసేదేమీ లేక ఇద్దరు హుటాహుటిన న్యాయస్థానం ముందు హాజరయ్యారు. నాన్‌బెయిల్‌బుల్ వారెంట్‌ను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Rama Photo: ఇంట్లో రాముడి ఫోటో పెట్టుకుంటున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాలు పాటించాల్సిందే?