కాంగ్రెస్ పథకాలను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే..

అమీర్‌పేటలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలను బిఆర్ఎస్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు

Published By: HashtagU Telugu Desk
Talasani Ameerpet

Talasani Ameerpet

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress)..మేనిఫెస్టో లో ప్రకటించిన హామీలను అమలు చేసే పనిలో పడింది. ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు హామీలను నెరవేర్చింది. 100 రోజుల్లో చెప్పినట్లు మొత్తం హామీలను అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమీర్‌పేటలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలను బిఆర్ఎస్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (BRS MLA Talasani) రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఉపయోగపడే పనులకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్బంగా తలసాని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలైన మహాలక్ష్మి కార్యక్రమం కింద మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం, రూ.4 వేల పింఛను, రూ.500కే గ్యాస్ సిలిండర్ కూడా వెంటనే అమలు చేయాలని తలసాని ప్రభుత్వాన్ని కోరారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి..శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో చేయూత పథకంతో పాటు మహాలక్ష్మి పధకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షలకు పెంచగా..మహాలక్ష్మి కింద మహిళకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు.

Read Also :

  Last Updated: 10 Dec 2023, 02:07 PM IST