Site icon HashtagU Telugu

BRS MLA Prakash Goud : సీఎం రేవంత్ రెడ్డితో మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ..ఈయన కూడా కాంగ్రెస్ లోకేనా..?

Prakash Goud

Prakash Goud

బిఆర్ఎస్ పార్టీ (BRS MLA) మరో ఎమ్మెల్యే ను కోల్పోబోతుందా..? అంటే అవుననే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు బిఆర్ఎస్ కేవలం 39 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి ఘోర ఓటమి చవిచూసింది. రెండు సార్లు భారీ విజయం సాధించిన బిఆర్ఎస్..మూడోసారి కూడా విజయం సాదించబోతామని ఆ పార్టీ నేతలంతా ఎంతో కలలు కన్నారు. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకొచ్చి బిఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చారు. ఈ షాక్ నుండి కోలుకోకముందే కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తేసింది. బిఆర్ఎస్ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుపడం తో ఇంకా ఆగుతారా..వరుస పెట్టి బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరడం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

పదేళ్ల పాటు బిఆర్ఎస్ పార్టీ లో కీలక పదవుల్లో కొనసాగిన వారి దగ్గ్గరి నుండి కింది స్థాయి నేతల వరకు వరుసపెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. రీసెంట్ గా దానం నాగేందర్ , కడియం శ్రీహరి , భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు లు చేరగా..ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధం అయ్యినట్లు తెలుస్తుంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (BRS MLA Prakash Goud) నేడు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన పార్టీ లో చేరేందుకు సిద్దమైనట్లు రేవంత్ తో చెప్పినట్లు తెలుస్తుంది. మరో రెండు , మూడు రోజుల్లో ఆయన అధికారికంగా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని అర్ధం అవుతుంది.

ఇదిలా ఉంటె నిన్న బిఆర్ఎస్ విస్తృత సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని..వారు ఇప్పుడంటే ఇప్పుడు బిఆర్ఎస్ లోకి వచ్చేందుకు సిద్ధం గా ఉన్నారని తెలిపి షాక్ ఇచ్చారు. మరి అది నిజామా..కదా అనేది తెలియాల్సి ఉంది.

Read Also : Liver Disease: మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా..? అయితే కాలేయ వైఫ‌ల్యం కావొచ్చు..!