Site icon HashtagU Telugu

Telangana: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. చివరికి ట్విస్ట్

Telangana

Telangana

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసిన విషయం తెలిసిందే. జనవరి 28న ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ తో భేటీ అయ్యాడు.దీంతో అతను కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. పైగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కారు పార్టీలో అలజడి మొదలైంది. కానీ తాజాగా ప్రకాష్ గౌడ్ పార్టీ మార్పుపై స్పష్టత ఇచ్చార. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.

రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే తాను బీఆర్‌ఎస్‌ను వదులుకోలేదని, ఎమ్మెల్యే హోదాలో రేవంత్‌ని కలిశానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, రాబోయే రోజుల్లో చాలా మంది పార్టీలో చేరతారని కాంగ్రెస్ అధినాయకత్వం గతంలోనే సూచించింది. దీంతో బీఆర్ఎస్ లో ఆందోళన మొదలైంది.

ప్రకాష్ గౌడ్ తెలుగుదేశం పార్టీలో చేరి ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి మారారు. 2023లో బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎంఐఎం మద్దతుతోనే గెలిచాడు. ప్రకాష్ గౌడ్ 2009 మరియు 2014 రాష్ట్ర ఎన్నికలలో టిడిపి టిక్కెట్‌పై గెలిచారు. తరువాత 2018 మరియు 2023 లో బీఆర్ఎస్ తరుపున పోటీ చేశారు. 2023లో ప్రకాష్‌గౌడ్‌ 23 వేల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిపై విజయం సాధించారు. ప్రకాష్‌గౌడ్‌కు 1,21,734 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి 89,638 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.

Also Read: NTR Devara : దేవర సెకండ్ హాఫ్.. ఎన్టీఆర్ నటనకు ప్రతి అభిమాని గర్వపడతాడా..?