Site icon HashtagU Telugu

I Am With CBN : చంద్ర‌బాబాబు మ‌ద్ద‌తు ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

BRS MLA

BRS MLA

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు పార్టీల‌క‌తీతంగా మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్ర‌బాబు అరెస్ట్ పై ఆయ‌న అభిమానులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తున్నారు. అయితే తెలంగాణ‌లో మాత్రం చంద్ర‌బాబు అరెస్ట్ బీఆర్ఎస్‌లోని కొంత‌మంది ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న క‌లిగిస్తుంది. ప్ర‌ధానంగా సెటిల‌ర్స్ ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు అరెస్ట్‌ను అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న అరెస్ట్‌ను కొంత‌మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండిస్తుండ‌గా.. మ‌రికొంత మంది ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు సంఘీభావ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఈ రోజు హైద‌రాబాద్ వ‌న‌స్థ‌లిపురంలో జ‌రిగిన సంఘీభావ ర్యాలీలో ఎల్బీన‌గ‌ర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ర్యాలీలో చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తుగా ఆయ‌న అభిమానులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ నినాదాలు చేశారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొన‌డంపై చ‌ర్చ జ‌రుగుతుంది. సెటిల‌ర్స్ ఓట్ల‌కోస‌మే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు తెలుపుతున్నారంటూ టీడీపీ నేత‌లు కామెంట్స్ చేస్తున్నారు.