Site icon HashtagU Telugu

IT Raids: ఎమ్మెల్యేలు వ్యాపారాలు చేయకూడదా?

IT Raids

New Web Story Copy (71)

IT Raids: తెలంగాణ ప్రజాప్రతినిధులపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 70 ఐటీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఏకకాలంలో ఐటీ సోదాలు జరిపారు. ఎమ్మెల్యేల వ్యాపారాలు, లావాదేవీలపై ఆరా తీశారు. పైళ్ల శేఖరరెడ్డికి పలు రియల్ ఎస్టేట్ కంపెనీలలో వాటాలు ఉన్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. అదేవిధంగా మర్రి జనార్దన్ రెడ్డి ఇల్లు, ఆఫీసు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. దీంతో బిఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఐటీ అధికారుల నెక్స్ట్ టార్గెట్ ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఐటీ సోదాలపై మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. రాజకీయ నాయకులకు వ్యాపారాలు ఉండకూడదని రాజ్యాంగంలో ఏమైనా రూల్ ఉందా అని ప్రశ్నించారు. 24 గంటలుగా నా ఇళ్లపై, కార్యాలయాలపై సోదాలు చేస్తున్నారు. సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నేను నా లావాదేవీలకు సంబంధించి అన్ని పన్నులు కడుతున్నానని తెలిపారు. ఇప్పటివరకు దాదాపుగా 200 కోట్లు పన్ను కట్టానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఐటీ అధికారులకు నేను పూర్తిగా సహకరిస్తున్నానని తెలిపారు. త్వరలో ఎలాంటి మచ్చ లేకుండా బయటపడుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. సోదాల అనంతరం ఐటీ అధికారులే క్లీన్ చిట్ ఇచ్చి వెళ్తారని చెప్పారు.

Read More: Powerful Cyclone Biparjoy: గుజరాత్‌ను వణికిస్తున్న బిపార్జోయ్ తుపాను.. సాయంత్రానికి తీరం దాటే ఛాన్స్..!