Site icon HashtagU Telugu

KTR Comments: ప్ర‌భుత్వం మొద్దు నిద్ర వీడాలి.. కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా విమ‌ర్శ‌లు

KTR Comments

KTR Comments

KTR Comments: తెలంగాణలో ప్ర‌స్తుతం అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్ అన్న‌ట్లుగా సాగుతుంది. బుధ‌వారం సీఎం రేవంత్ వ‌ర్సెస్ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. ప్ర‌శ్న‌లు, జ‌వాబులు, పంచ్‌లు.. ప్రాస‌ల‌తో స‌భ అంతా ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. అయితే ఈ క్ర‌మంలోనే కేటీఆర్ (KTR Comments) ట్విట్ట‌ర్ వేదిక‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు కురిపించారు.

We’re now on WhatsApp. Click to Join.

కేటీఆర్ త‌న ఎక్స్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలుపడుతున్నారు. చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తున్నది. మేయర్‌, అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ గాడితప్పుతున్నది. పర్యవేక్షించాల్సిన పార్ట్-టైం మున్సిపల్ మంత్రేమో ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఢిల్లీ చక్కర్లలో బిజీగా ఉన్నారు. ప్ర‌భుత్వం మొద్దు నిద్ర వీడాలి. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. పౌరుల ఆరోగ్యాలు కాపాడాలిని ట్వీట్ చేశారు.

Also Read: Malavika Mohanan : తంగలాన్ సెట్ లో హీరోయిన్ కి వింత అనుభవం.. చెప్పకుండా డైరెక్టర్ ఆ పని చేయించాడట..!

తెలంగాణ‌లో దంచికొడుతున్న వ‌ర్షాలు

తెలంగాణ‌లో గ‌త నాలుగు రోజులుగా వ‌ర్షం కురుస్తూనే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ప‌లు జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల‌గా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక‌పోతే తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో కూడా వ‌ర్షం దంచికొడుతుంది. లోతట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఇప్ప‌టికే జీహెచ్ఎంసీ అధికారులు లోత‌ట్టు ప్రాంతాల్లో చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Also Read: World IVF Day : పెళ్లి చేసుకోకుండానే ఐవీఎఫ్‌తో సంతానం పొందిన సెలబ్రిటీలు