BRS MLA Koushik Reddy : బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్

చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద సాక్ష్యాలతో నిరూపిస్తానని కౌశిక్ రెడ్డి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు

Published By: HashtagU Telugu Desk
Koushik Reddy

Koushik Reddy

హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (BRS MLA Koushik Reddy) ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ జిల్లా వీణవంకలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసారు.

అసలు ఏం జరిగిందంటే..

ఫ్లైయాష్ తరలింపు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. వంద కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించిన నేప‌థ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల విమర్శలు ప్రతివిమర్శలు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీశాయి. కేవలం పబ్లిసిటీ కోసం మంత్రి పొన్నం పై ఆరోపణలు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఎమ్మేల్యే కాకముందు ఉద్యోగులు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేశారని తాజాగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద సాక్ష్యాలతో నిరూపిస్తానని కౌశిక్ రెడ్డి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. సవాల్ ను స్వీకరించిన కౌశిక్ రెడ్డి తాను కూడా వస్తానని ప్రకటన చేశారు. దీంతో అలార్ట్ అయిన పోలీసులు చెల్పూర్ లో ఏర్పాటు చేసిన టెంట్ ఫ్లెక్సీలను తొలగించి ఎమ్మేల్యే కౌశిక్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసారు. మరోవైపు, ప్రణవ్ కూడా చెల్పూర్ బయలుదేరారు. దీంతో పోలీసులు హనుమాన్ దేవాలయం వద్ద 144 సెక్షన్ ను అమలు చేశారు. హుజురాబాద్, జమ్మికుంట రహదారిలో బారికేడ్లను ఏర్పాటు చేసి కార్యకర్తలను ఎవ్వరినీ అక్కడికి అనుమతించడం లేదు. హనుమాన్ టెంపుల్ చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు.

Read Also : Jr Doctors Protest : తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న జూడాల సమ్మె

  Last Updated: 25 Jun 2024, 03:22 PM IST