Site icon HashtagU Telugu

MLA Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు

MLA Kaushik Reddy

MLA Kaushik Reddy

MLA Kaushik Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్‌పై దాడి కేసులో సోమ‌వారం రాత్రి అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి (MLA Kaushik Reddy) భారీ ఊర‌ట ల‌భించింది. దాడి కేసులో పాడి కౌశిక్‌కు బెయిల్ మంజూరు చేస్తూ క‌రీంన‌గ‌ర్ జ‌డ్డి తీర్పునిచ్చారు. పాడి రిమాండ్ రిపోర్ట్‌ను జ‌డ్జి కొట్టేశారు. క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌రేట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హ‌ల్ చ‌ల్ చేశార‌ని, ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశార‌ని ఆయ‌న‌పై మొత్తం 3 కేసుల‌ను పోలీసులు న‌మోదు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై న‌మోదైన కేసులు అన్ని కుడా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసులేన‌ని ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాదులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా ఏడు సంవత్సరాల శిక్ష పడే వాటికి బెయిల్ మంజూరు చేయవచ్చని పేర్కొన్నారు.

కరీంనగర్ మేజిస్ట్రేట్ ముందు తీసుకు వెళ్ళేటప్పుడు మీడియాతో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. న్యాయానికి అన్యాయమైన కేసులు పెడితే భయపడలేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రశ్నిస్తూనే ఉంటామ‌ని, ఎన్ని కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటామ‌ని ఆయ‌న మీడియా ముఖంగా చెప్పారు. బీఆర్ఎస్‌ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయినవాన్ని అడిగితే దానిపైన అక్రమ కేసులు పెట్టి నన్ను అరెస్టు చేశారు. ఇది ఎంతో బాధాకరమ‌ని ఆయ‌న అన్నారు. పండగ పూట అరెస్ట్ చేసి ఇంట్లో లేకుండా చేస్తున్నారని రేవంత్ స‌ర్కార్‌పై మండిప‌డ్డారు.

Also Read: Gold Price Today : పండగ వేళ బంగారం ధరలు పెరుగుదల..!

ఇంట‌ర్వ్యూ ముగించుకుని వ‌స్తుండ‌గా అరెస్ట్‌

ఇక‌పోతే ఎమ్మెల్యే సంజ‌య్‌పై దాడి కేసులో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వ‌ద్ద అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే స‌మ‌యంలో ఆయ‌న ప్ర‌ముఖ టీవీ ఛానెల్‌లో ఇంట‌ర్వ్యూ ముగించున‌కుని వ‌స్తుండగా సుమారు 40 మంది పోలీసులు వ‌చ్చి ఆయ‌న్ను అదుపులోకి తీసుక‌న్నారు. అరెస్ట్ చేసిన వెంట‌నే క‌రీంన‌గ‌ర్‌కు త‌ర‌లించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యార‌ని వార్త తెలిసిన వెంట‌నే బీఆర్ఎస్ నాయ‌కులు, పార్టీ లీగ‌ల్ టీమ్ కరీంన‌గ‌ర్ వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్‌కు చేరుకుంది.