MLA Harish Rao: అసత్య ప్రచారాలు మానుకోండి; హరీష్ సీరియస్ వార్నింగ్

బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీజేపీ పార్టీలో చేరుతున్నారా?, హరీష్ త్వరలో రేవంత్ ని కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారా? గత కొంత కాలంగా ఇవే వార్తలు పలు మీడియా సంస్ధలు, డిజిటల్ సంస్థల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Mla Harish Rao

Mla Harish Rao

MLA Harish Rao: బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీజేపీ పార్టీలో చేరుతున్నారా?, హరీష్ త్వరలో రేవంత్ ని కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారా? గత కొంత కాలంగా ఇవే వార్తలు పలు మీడియా సంస్ధలు, డిజిటల్ సంస్థల్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, వ్యూస్ కోసం అసత్య ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హ్హరిష్ రావు. అవసరమైతే నోటీసులు కూడా జారీ చేయనున్నట్టు ఆయా మీడియా సంస్థలపై ఫైర్ అయ్యారు.

.గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారం చేపట్టింది. ఆ తర్వాత జరిగిన లోకసభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది. దీంతో హరీష్ రావు ఆ పార్టీని వీడనున్నట్లు వార్తలు వినిపించాయి. బీఆరఎస్ లో హరీష్ కు సముచిత స్థానం కల్పించకపోవడంతోనే హరీష్ బయటకు వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. అయితే అసత్య ప్రచారంపై తాజాగా హరీష్ రావు స్పందించారు.

ఆయా మీడియా సంస్థలను ఉద్దేశించి మాట్లాడిన హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యూస్ కోసం అసత్యప్రచారాలు చేయడం కారణంగా వ్యక్తి వ్యక్తిత్వం దెబ్బతింటుంది అని అన్నారు. ఏదైనా సమాచారం కావాలి అంటే నేరుగా నన్ను సంప్రదించాలని సూచించారు. ఇలాంటి అసత్య ప్రచారాలు పునరావృతం అయితే లీగల్ నోటీసులు జారీ చేస్తానని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసత్య థంబ్ లు పెట్టి లీడర్ క్రెడిబిలిటీని దెబ్బతీయొద్దంటూ హెచ్చరించారు.

Also Read: Harish Rao : కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగిన హరీష్ రావు..

  Last Updated: 17 Jun 2024, 08:24 PM IST