కాంగ్రెస్ పార్టీ (Congress) అన్నంత పని చేస్తుంది..త్వరలోనే బిఆర్ఎస్ ఖాళీ అవుతుందని..బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినా వారంతా కాంగ్రెస్ లోకి వస్తారని చెపుతూ వస్తుండగా..ఇప్పుడు అదే జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినా ఎమ్మెల్యేలు వరుసపెట్టి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకోగా..ఇప్పుడు మరో ఎమ్మెల్యే అదే బాటలో నిలిచారు. గద్వాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (MLA Bandla Krishna Mohan Reddy) కాంగ్రెస్ లో చేరారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
We’re now on WhatsApp. Click to Join.
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్త బయటకు వచ్చిన దగ్గరి నుండి స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. సరిత అనుచరులు గురువారం ఏకంగా సెల్ టవర్ ఎక్కడం, పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి, సరితా తిరుపతయ్యతో భేటీ అయ్యి నచ్చజెప్పారు. అలాగే, ఎమ్మెల్యే కృష్ణమోహన్ కాంగ్రెస్‌లో చేరినా సరితకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటె 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలు గెలుచుకోగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానాన్ని కోల్పోయింది. ఇప్పటివరకు బిఆర్ఎస్ నుండి కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య లు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చారు. ప్రస్తుతం బిఆర్ఎస్ లో 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
Read Also : Bonalu 2024 : హైదరాబాద్ లో మొదలైన బోనాల సందడి..రేపు గోల్కొండ బోనాల జాతర