BJP and BRS: ఈటెల, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య చర్చలు, తేల్చేసిన పువ్వాడ!

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు ఊపందుకున్నాయి. వివిధ పార్టీల నేతలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - July 5, 2023 / 12:02 AM IST

Puvvada Comments: ఖమ్మంలో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కేసీఆర్, బీజేపీ ఒక్కటేనని చెప్పేందుకు బీఆర్ఎస్, బీజేపీ బీ టీమ్ అని విమర్శించారు. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. రాహుల్‌ను చాలా మంది పప్పు అని పిలుస్తారు.. కానీ అతను తగిన వ్యక్తి. కాంగ్రెస్, బీజేపీలు ఏ టీమ్, బీ టీమ్ అని వ్యాఖ్యానించారు. ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య చర్చలు జరగడం నిజం కాదా? కావాలంటే ఈటెల రేవంత్ హోటల్లో కలుసుకున్న  ఫోటో లు  రాహుల్ కు  పంపిస్తా అంటూ ఘాటుగా ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ని వీడిన ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరారు. జాతీయ పార్టీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచి.. బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని నింపారు. అయితే.. సాధారణంగా బీజేపీ లాంటి జాతీయ పార్టీల్లో ముందు నుంచి వచ్చిన నేతలకే ప్రాధాన్యం ఉంటుంది. RSS నేపథ్యం ఉన్న వ్యక్తులకు ప్రధాన బాధ్యతలు అప్పగిస్తారు. పార్టీలో తనకు సరైన నాయకత్వం లభించడం లేదని ఈటల రాజేందర్ కొద్ది రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఖమ్మం సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో మరోసారి ఈటెల ప్రస్తావన తెరపైకి వచ్చింది. నిజానికి ఈటల, రేవంత్‌రెడ్డిలు టచ్‌లో ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

ఇక వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడారని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను గుర్తించి చర్చించాలన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్క్రిప్ట్ చదివారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఒక రిమోట్ గాంధీ. కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్‌ గాంధీ పరిస్థితి ఏంటో తెలియదన్నారు. గతంలో తెలంగాణకు ముందు పదేళ్లు పాలించిన కాంగ్రెస్.. అలాంటప్పుడు పింఛన్లు, కల్యాణలక్ష్మి, 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

Also Read: CI Suicide: పోలీస్ శాఖకు షాక్, తాడిపత్రి సీఐ ఆత్మహత్య!