Site icon HashtagU Telugu

Gangula kamalakar: బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు మరిన్ని వసతులు

Minister Gangula Kamalakar Meeting with Millers association

Minister Gangula Kamalakar Meeting with Millers association

రాష్ట్రంలో బిసి విద్యా సంబందిత అంశాలైన జాతీయ సంస్థల్లో బిసి రియంబర్మంట్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ విద్యార్థులకు సకల వసతులు వంటి నూతన కార్యక్రమాలకు సంబందించి జీవో విడుదల, నూతన లోగో విడుదలను ఈ నెల 28 శుక్రవారం బిసి మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ తో పాటు బిసి సంఘం నేతలు ఆర్ క్రుష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇతర నేతల సమక్షంలో విడుదల చేస్తామన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ మేరకు కరీంనగర్లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విద్యనే అన్నింటికి మూలమని, సామాజిక సమానత్వం విద్యతోనే సాద్యమనే గొప్ప నిర్ణయంతో ముఖ్యమంత్రి బిసిలకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. నిన్ననే తెలంగాణ బిసి బిడ్డలకు జాతీయ స్థాయిలోని నేషనల్ ఇన్ట్సిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్ లోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ తదితర 200కు పైగా విద్యాసంస్థల్లో బిసి విద్యార్థులకు పీజు రియంబర్మెంట్ అందజేసే పథకాన్ని ప్రకటించుకున్నామన్నారు మంత్రి గంగుల.
 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు తీపికబురు కేసీఆర్ సర్కార్ అందిస్తుందన్నారు, రాష్ట్రంలోని 401 ప్రీమెట్రిక్ హాస్టళ్లోని 30,732 మంది విద్యార్థుల మాదిరే రాష్ట్రంలోని బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు సైతం సంపూర్ణ వసతులు కల్పిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. రాష్ట్రంలోని 302 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని 34వేలకు పైగా బిసి విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి బోజన, వసతితో పాటు పూర్తి స్థాయిలో కాస్మెటిక్ చార్జీలు, వులన్ బ్లాంకెట్స్, బెడ్ షీట్స్, కార్పెట్స్, నోట్ బుక్స్ తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. గతంలో బోజన, వసతి మాత్రమే అందజేసేవాళ్లమని, నేటి నిర్ణయంతో విద్యార్థులు మరింత ఉత్సాహంతో విద్యను అభ్యసించి రాష్ట్రం పేరును నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇప్పటికే బిసి గురుకులాల విద్యార్థులు రాష్ట్రం పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిలుపుతున్నారని, నిన్ననే రాష్ట్ర, అంతర్జాతీయంతో పాటు జాతీయ స్థాయిలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరే బిసి విద్యార్థులకు పీజు రియంబర్మెంట్ ప్రకటించిందని ఇలాంటి అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసారు మంత్రి గంగుల కమలాకర్.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలైన రైతుబందు, ఆసరా పించన్లు, 24గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మీ వంటి పథకాల్లో మెజార్టీ వాటా అందజేయడంతో పాటు, కోకాపేట, ఉప్పల్ బగాయత్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో వేలకోట్ల విలువ గల స్థలాల్లో 42కులసంఘాలకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామాల్లో కమ్యూనిటీ హాల్లు, కులవ్రుత్తుల పునర్వైబవానికి ఆర్థిక సాయం, గతంలో కేవలం 19 గురుకులాల నుండి 327 గురుకులాలకు పెంచి 152 పదోతరగతి వరకూ, 142 ఇంటర్ వరకూ 33 డిగ్రీ కాలేజీలు ద్వారా 1,87,230 మంది విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య, 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్పులు తదితర ఎన్నో పథకాల ద్వారా వెనుకబడిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు మంత్రి గంగుల కమలాకర్.
Also Read: Ram Likes Baby: యంగ్ బ్యూటీకి రామ్ అదిరిపొయే గిఫ్ట్, ఆనందంలో బేబీ హీరోయిన్!