Site icon HashtagU Telugu

BRS Menfesto 2023 : తెలంగాణ లో సరికొత్త పథకాలను ప్రకటించబోతున్న కేసీఆర్..

Brs Menfesto 2023

Brs Menfesto 2023

ఎన్నికలు (Elections) వస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల పథకాలను ప్రకటిస్తుంటారు. ఈ పథకాలతో ఎన్నికల్లో గెలవాలని చూస్తారు. ప్రస్తుతం తెలంగాణ లో కూడా అదే నడుస్తుంది. మరో రెండు , మూడు నెలల్లో ఎన్నికలు రాబోతుండడం తో అధికార పార్టీ (BRS) తో పాటు ప్రతిపక్ష పార్టీలు అనేక పథకాలను ప్రకటించేపనిలో ఉన్నారు. ఇప్పటీకే కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి వస్తే పలు పథకాలను ప్రవేశ పెడతామని హామీ ఇచ్చింది.

ఈ పధకాల పేరుతో ప్రజల్లోకి వెళ్లబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ పధకాల ఫై ప్రజల దృష్టి పడింది. ఇప్పటీకే రెండుసార్లు బిఆర్ఎస్ కు ఛాన్స్ ఇచ్చాం..ఈసారి కాంగ్రెస్ కు ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో తెలంగాణ ప్రజలు పడ్డారు. దీనిని గ్రహించిన గులాబీ బాస్ అంతకు మించే అనేలా కొత్త పథకాలను ప్రవేశ పెట్టబోతున్నట్లు సమాచారం.

కేసీఆర్ (KCR) అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్లలో ఎన్నో పథకాలను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలనే కాదు దేశ ప్రజలను సైతం ఆశ్చర్య పరిచారు. ఇలాంటి పధకాలు మా రాష్ట్రాల్లో కూడా ప్రవేశ పెట్టాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీకి దిమ్మతిరిగిపోయే బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని.. త్వరలోనే అన్ని వర్గాల వారు శుభవార్త వింటారు అని తాజాగా మంత్రి హరీష్ రావు తెలిపారు.

ఇప్పటికే కేసీఆర్ చెప్పిన ప్రతిమాట చేసి చూపించారని.. ఉచిత కరెంట్, ఎకరానికి రైతుబంధు రూ.5వేలు ఇస్తా అన్నట్లే ఇస్తున్నాడు. ఫింఛన్, ఆడ పిల్ల పెళ్లికి రూ.1లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మీ, బిడ్డ డెలివరీకి వెళ్లితే.. కేసీఆర్ కిట్, డెలివరీ అయిన తరువాత 12, 13 వేలు అందిస్తున్నాడు. అదేవిధంగా ఇంటింటికి మంచినీళ్లు ఇస్తూ..ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు..మరోసారి అధికారం లోకి మరిన్ని పథకాలను తీసుకరాబోతున్నాడని హరీష్ తెలిపారు. హరీష్ రావు మాటలను బట్టి చూస్తే ఈసారి బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో అంతకు మించేలా అనేలా ఉండబోతుందని అర్ధం అవుతుంది.

Read Also : Womens Reservation Bill : మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ప్రెసిడెంట్ ఆమోద ముద్ర