వరంగల్‌లో రేపు( ఏప్రిల్ 27న) జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ (BRS Silver Jubilee) రద్దైందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని (Social Media) బీఆర్ఎస్ పార్టీ (BRS) ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, సభ యథాతథంగా జరగబోతుందని స్పష్టం చేసింది. పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సభ రద్దు అయినట్టు కొందరు ఫేక్ ప్రచారం (Fake Campaign) చేస్తుండగా, ప్రజల నుండి వస్తున్న అపూర్వమైన ఆదరణను చూసి కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు ప్రచారాలకు దిగుతున్నాయని బీఆర్ఎస్ మండిపడింది. ఈ సభతో కాంగ్రెస్, బీజేపీల భవిష్యత్తు భూస్థాపితం అవడం ఖాయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం
వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలంలో జరగనున్న ఈ రజతోత్సవ సభను బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. 1,213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేయగా, ప్రధాన వేదికను 154 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం 1,059 ఎకరాల విస్తీర్ణం కేటాయించడం విశేషం. సభను మరింత భవ్యంగా మార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి వేడిని దృష్టిలో ఉంచుకొని, 10 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 అంబులెన్సులు, 12 వైద్య శిబిరాలు, 1,200 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం లేకుండా 250 జనరేటర్లు ఏర్పాటు చేయడం గమనార్హం.
గులాబీ జెండాలతో వరంగల్ మార్మోగనుంది
ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలిరానున్నారు. సభలో గులాబీ జెండాలు రెపరెపలాడనున్నాయి. సభ విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను తరలించేందుకు 3,000 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు, వేలాది డీసీఎంలు, ట్రాక్టర్లు, కార్లు, వ్యాన్లు కూడా ఉపయోగించబోతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపి, గులాబీ జెండాను మరింత ఎగురవేసేలా చేయబోతోంది.
Sudan War Effect: యుద్ధం ఎఫెక్ట్.. బొగ్గు, ఆకులు తింటున్న జనం