Site icon HashtagU Telugu

KTR: BRS అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కామ్ లు.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్

ktr

ktr

KTR: ధాన్యం అమ్మకం, సన్న బియ్యం కొనుగోలులో 1000 కోట్ల రూపాయల కాంగ్రెస్ కుంభకోణంపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ లో రియాక్ట్ అయ్యారు. 15 రోజుల కింద ఈ కుంభకోణాన్ని మా పార్టీ బయటకు తీసినా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని, ఈ కుంభకోణం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, ఉత్తంకుమార్ రెడ్డి గారి ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలేదు.. మేము లేవనెత్తిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదని కేటీఆర్ అన్నారు.

‘‘BRS అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కామ్ లు, గల్లిమే లూటో, ఢిల్లీలో భాటో అన్నదే కాంగ్రెస్ నీతి, కాంగ్రెస్ అంటే కుంభకోణాల కుంభమేళా, ధాన్యం సేకరణపైన దృష్టి పెట్టకుండా రైతన్నల నుంచి సేకరించిన ధాన్యం పైన కన్ను వేసి ఈ స్కాంకి, అవినీతి చీకటి దందాకు తెరలేపారని అన్నారు. ఇప్పుడు మీకు ఈ కుంభకోణం లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఢిల్లీ పెద్దల ప్రమేయం కూడా ఉందని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పని చేతనైత లేదు కానీ… తమ జేబులు నింపుకొని ప్రయత్నం చేస్తున్నారు. 35 లక్షల ధాన్యం నమ్మకం కోసం గ్లోబల్ టెండర్ల పేరుతో పిలిచిన మొదటి స్కాం’’ అని కేటీఆర్ అన్నారు.

‘‘2.20 లక్షల టన్నుల సన్న బియ్యం కొనుగోలు పక్రియ రెండో కుంభకోణం. మొత్తం వెయ్యి కోట్ల రూపాయల స్కాం జరిగింది. ధాన్యం అమ్మకం కోసం అవినీతి కుట్రకు తెర తీసింది. జనవరి 25వ తేదీన కమిటీ వేసి, అదే రోజున కమిటీ ఏర్పాటు చేసి, ఈరోజు మార్గదర్శకాలు విడుదల చేసి, అదే రోజు టెండర్లను పిలిచింది. హామీల అమలులో లేని ఈ జెడ్ స్పీడు అవినీతి సొమ్ము కోసం మాత్రం కాంగ్రెస్ పెద్దలు చూపించారు. ధాన్యంకు 2100 క్వింటాలు చొప్పున స్థానికంగా రైస్ మిల్లు కొంటాం అన్న ఇవ్వకుండా, అర్హత నిబంధనలో మార్పులు చేసి గ్లోబల్ టెండర్ల పేరుతో కుట్రకు తెరలేపింది’’ అని కేటీఆర్ అన్నారు.