Site icon HashtagU Telugu

BRS Manifesto : బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుద‌ల‌

Brs Manifesto 2023 Released

Brs Manifesto 2023 Released

తెలంగాణ ఎన్నికల సమరం (Telangana Assembly Elections) మొదలైంది. మరో 45 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అయ్యాయి. రెండుసార్లు విజయం సాధించిన బిఆర్ఎస్ (TRS) ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..నేడు 51 మంది అభ్యర్థులకు బీ ఫారాలు (KCR Disributes b forms to BRS Candidates ) అందజేశారు. మిగతా వారికీ రెండు రోజుల్లో అందజేస్తామని తెలిపారు. అనంతరం 2023 మేనిఫెస్టో ను విడుదల చేసారు.

ఈ మేనిఫెస్టో ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉండే..కాంగ్రెస్ పార్టీ (Congress Party ) ఈసారి ఎన్నికల్లో తెలంగాణ లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా , ఆరు గ్యారెంటీ లతో ఈసారి తాము తప్పనిసరి విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తుంది. మరోపక్క బిజెపి సైతం అంతే విధంగా విశ్వసంగా ఉంది. రాష్ట్రంలో , కేంద్రంలో ఒకేపార్టీ ఉంటె రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందని చెపుతూ వస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం తో ప్రచారం చేస్తుంది. రాష్ట్రానికి 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందని , అయితే కేసీఆర్ (KCR) ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తుంది. ఇలా ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు దీటుగా ప్రజల్లోకి వెళ్లేందుకు గులాబీ బాస్ సిద్ధం అయ్యారు.

హామీలను చెప్పడమే కాకుండా, వాటి అమలుకు తమ వద్ద ఉన్న వనరులు, అమలు విధానాలను కూడా కేసీఆర్‌ ప్రజలకు వెల్లడించారు. ప్రజల అవసరాలు తీర్చేలా, రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడేలా మ్యానిఫెస్టో ను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రణాళిక రూపంలో గతంలో తాము 10 శాతం చెబితే.. అమలు మాత్రం 90 శాతం చేశామని కేసీఆర్ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మైనార్టీల బడ్జెట్ ను పెంచుతామన్నారు. వారి సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. మైనార్టీ జూనియర్ కాలేజీలను డగ్రీ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తామన్నారు. దళితబంధు పథకాన్ని కొనసాగిస్తామన్నారు.

BRS మేనిఫెస్టో 2023 హైలైట్స్ :

హుస్నాబాద్ సభతో గులాబీ బాస్ ప్రచారం…

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. వచ్చే నెల 9 వరకు 42 నియోజికవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. నవంబర్ 11న గజ్వేల్ , కామారెడ్డి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు కేసీఆర్. ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ సెంటిమెంట్ నియోజకవర్గం అయిన హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్నిప్రారంభించనున్నారు. 2014 మరియు 2018లో రెండుసార్లు హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్ విజయం సాధించారు. మరోసారి కూడా ఇక్కడ్నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు కేసీఆర్. మొత్తం 17 రోజుల్లో 42 సభల్లో పాల్గొననున్నారు కేసీఆర్. మరోవైపు కేసీఆర్ సభ కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు స్థానిక నేతలు. ఈ సభ కోసం భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ చూస్తే..

• అక్టోబర్ 15: హుస్నాబాద్

• అక్టోబర్ 16: జనగాన్ మరియు భువనగిరి

• అక్టోబర్ 17: సిద్దిపేట మరియు సిరిసిల్ల

• అక్టోబర్ 18: జడ్చర్ల మరియు మేడ్చల్

• అక్టోబర్ 26: అచ్చంపేట్, నాగర్ కర్నూల్ ,మునుగోడు

• అక్టోబర్ 27: పాలేరు మరియు స్టేషన్ ఘన్‌పూర్

• అక్టోబర్ 29: కోదాడ, తుంగతుర్తి, ఆలేరు

• అక్టోబర్ 30: జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్

• అక్టోబర్ 31: హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ

• నవంబర్ 1: సత్తుపల్లి మరియు ఇల్లందు

• నవంబర్ 2: నిర్మల్, బాల్కొండ మరియు ధర్మపురి

• నవంబర్ 3: భైంసా (ముధోల్), ఆర్మూర్ మరియు కోరుట్ల

• నవంబర్ 5: కొత్తగూడెం మరియు ఖమ్మం

• నవంబర్ 6: గద్వాల్, మక్తల్, నారాయణపేట

నవంబర్ 7: చెన్నూరు, మంథని, పెద్దపల్లి

నవంబర్ 8: సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి

నవంబర్ 9: గజ్వేల్ మరియు కామారెడ్డి

 

Read Also : BJP OBC Protest: ఢిల్లీలో కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ ఓబీసీ నిరసనలు