BRS Lucky : కేసీఆర్ కు వ‌రంగా రూ. 2వేల నోట్ ర‌ద్దు

BRS Lucky )నోట్ల ర‌ద్దు చేసిన త‌రువాత జ‌రిగిన 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ (BJP) గెలిచింది.ఇప్పుడు రూ. 2వేల నోట్ కు ర‌ద్దు పెట్టింది.

  • Written By:
  • Publish Date - May 20, 2023 / 04:23 PM IST

(BRS Lucky )నోట్ల ర‌ద్దు చేసిన త‌రువాత జ‌రిగిన 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ (BJP)అప్ర‌తిహ‌తంగా గెలిచింది. అదే సీన్ రిపీట్ అవుతుంద‌ని భావిస్తోన్న బీజేపీ ఇప్పుడు రూ. 2వేల నోట్ కు ర‌ద్దు చేస్తూ డెడ్ లైన్ పెట్టింది. ఇలాంటి కీల‌క నిర్ణ‌యం బీజేపీకి ఉప‌యోగ‌మా? విప‌క్షాల‌కు న‌ష్ట‌మా? అనే ప్ర‌శ్న ఇప్పుడు ఉత్ప‌న్నం అవుతోంది. ప్ర‌త్యేక కర్ణాట‌క ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే రూ. 2వేల నోట్ ర‌ద్దు చేయ‌డం రాబోవు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, చ‌త్తీస్ గ‌డ్, తెలంగాణ ఎన్నిక‌ల కోస‌మేనా? అనే అనుమానం కూడా వ‌స్తోంది.

నోట్ల ర‌ద్దు చేసిన త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో…(BRS Lucky )

నోట్ల ర‌ద్దు త‌రువాత జ‌రిగిన యూపీ ఎన్నిక‌ల్లో బీజేపీ(BJP) గెలిచింది. ఆ త‌రువాత జ‌రిగిన 2019 ఎన్నిక‌ల్లోనూ హ‌వాను కొన‌సాగించింది. ఈ అనుభావాల‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని భావించే వాళ్లు లేక‌పోలేదు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీకి ద‌క్షిణ భార‌త‌దేశంలోని ఒకేఒక రాష్ట్రం జారిపోయింది. ఆ ఓట‌మిని త‌ట్టుకోలేక పోతోంది. పైగా బీజేపీ వేసిన వ్యూహాలు క‌ర్ణాట‌క రాష్ట్రంలో ప‌నిచేయ‌లేదు. విప‌క్షాలు డ‌బ్బును విచ్చ‌ల‌విడిగా పంచ‌డం కార‌ణంగా ఈ ఓట‌మిని బీజేపీ అంచ‌నా వేస్తోంది. చైనా (China)మ‌ద్ద‌తును కాంగ్రెస్ కూడ‌గ‌ట్టుకుంటుంద‌ని మొద‌టి నుంచి క‌మ‌ల‌నాథుల అనుమానం. ఆ దేశం నుంచి వ‌స్తోన్న క‌రెన్సీతో రాజ‌కీయం చేస్తున్నార‌ని మోడీ స్వ‌యంగా ఆరోపించారు. క‌ర్ణాట‌క గెలుపు వెనుక కూడా విదేశీ క‌రెన్సీ ఉంద‌ని కేంద్రం అనుమానం. అందుకే, రూ. 2వేల నోట్ ను ర‌ద్దు చేయ‌డం ద్వారా రాబోవు ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని బీజేపీ ఆశిస్తోంద‌ని కొంద‌రు భావ‌న‌.

గ్రామ‌స్థాయి క‌మిటీల ద్వారా ఓట‌ర్ల‌కు నోట్ ల‌ను పంపిణీ

వాస్త‌వంగా అధికాంలో ఉన్న పార్టీలు అక్ర‌మాలు, అవినీతి, అడ్డ‌దారులు దొక్కుతాయి. ఫ‌లితంగా కోట్లాది రూపాయాల‌ను పోగుచేసుకుంటాయి. ఆ ధ‌నాన్ని విచ్చ‌ల‌విడిగా ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు చేయ‌డాన్ని చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో సెంటిమెంట్ ప‌నిచేయ‌డం ద్వారా కేసీఆర్ (KCR) బొటాబొటి మెజార్టీతో సీఎం అయ్యారు. ఆ త‌రువాత 2018 ఎన్నిక‌ల నాటికి విచ్చ‌ల‌విడిగా డ‌బ్బు ఖ‌ర్చు చేసి ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేశార‌ని స‌ర్వ‌త్రా వినిపించిన ఆరోప‌ణ‌లు. అంతేకాదు, ఆ ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను భారీ డ‌బ్బుతో లోబ‌రుచుకున్నార‌ని విప‌క్షాల విమ‌ర్శ‌. ఫ‌లితంగా రెండోసారి అధికారంలోకి కేసీఆర్ వ‌చ్చార‌ని చెబుతుంటారు.

మూడోసారి సీఎం కావ‌డానికి కేసీఆర్(KCR) ఇప్ప‌టి నుంచే(BRS Lucky) ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం డ‌బ్బును గ్రామస్థాయికి పంప‌డానికి రూ. 2వేల ర‌ద్దు త‌రువాత వేగ‌వంతం చేశార‌ట‌. సెప్టెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు రూ. 2వేల నోట్ల‌ను బ్యాంకుల్లో య‌ధేచ్చ‌గా మార్చుకోవ‌డానికి ఆర్బీఐ అనుమ‌తి ఇచ్చింది. గ్రామ‌స్థాయి క‌మిటీల ద్వారా ఓట‌ర్ల‌కు నోట్ ల‌ను పంపిణీ చేస్తే వాళ్లే బ్యాంకులకు వెళ్లి మార్చుకునే ఏర్పాట్ల‌కు దిగార‌ని తెలుస్తోంది. ఓటుకు రూ. 10వేల చొప్పున ఇవ్వ‌డానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధ‌మ‌వుతుంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల ఆరోప‌ణ‌. పైగా ఎన్నిక‌లు ఆరు నెల‌లు ముందుగానే వాళ్ల‌కు రూ. 2వేల నోట్ల‌ను ఇవ్వ‌డం ద్వారా ఆక‌ర్షించాల‌ని రంగం సిద్దం చేశార‌ని తెలుస్తోంది. అంటే, కేంద్రం నిర్ణ‌యం ఇప్పుడు రాజ‌కీయ పార్టీల‌కు ముంద‌స్తుగా డ‌బ్బు పంపిణీకి క‌లిసి వ‌స్తోంద‌న్న‌మాట‌.

రాజ‌కీయ పార్టీల‌కు ముంద‌స్తుగా డ‌బ్బు పంపిణీకి

దేశంలో సుమారు రూ. 3.50ల‌క్ష‌ల కోట్లు విలువైన‌ రూ. 2వేల నోట్లు ఉన్నాయ‌ని ఆర్బీఐ అంచ‌నా. అవ‌న్నీ రాజ‌కీయ పార్టీలు, నేత‌లు, పారిశ్రామిక‌వేత్తలు, వ్యాపార వేత్త‌ల వ‌ద్ద బ్లాక్ మ‌నీ రూపంలో పోగ‌య్యాయ‌ని ఆర్థిక నిపుణుల అభిప్రాయం. సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో బ్లాక్ మ‌నీ పెద్ద ఎత్తున బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఓట‌ర్లను ప్ర‌లోభ‌పెట్ట‌డానికి బ్లాక్ మ‌నీ వాడ‌డం స‌ర్వ‌సాధారణంగా మారింది. ఈసారి బ్లాక్ మ‌నీ ఎక్కువ‌గా రూ. 2వేల నోట్ల రూపంలో ఉంద‌ని కేంద్రం అంచ‌నా. అందుకే, రూ. 2వేల నోట్ ను ర‌ద్దు చేసిన‌ట్టు బీజేపీ చెబుతోంది. కానీ, గ‌త తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ నేత‌లు పెద్ద ఎత్తున సంపాదించారు. అందుకు ఉదాహ‌ర‌ణ క‌ర్ణాట‌కలోని 40శాతం క‌మిష‌న్ స్లోగ‌న్‌.

Also Read : KCR: కాంగ్రెస్ పై కేసీఆర్ స్వారీ, ఎన్డీయే ముద్రలో వైసీపీ, టీడీపీ

ప్రాంతీయ పార్టీల వ‌ద్ద బ్లాక్ మ‌నీ ఎక్కువ‌గా ఉంద‌ని కేంద్రం భావిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని బ‌ల‌మైన పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్ప‌డి వేల కోట్లు దోచుకున్నార‌ని అంచ‌నా వేస్తోంది. దేశంలోని అత్యంత ధ‌నిక సీఎంగా ఇటీవ‌ల ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jaganmohan Reddy) తేలారు. ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ‌గా డ‌బ్బున్న పార్టీగా బీఆర్ఎస్ ఉంది. అంతేకాదు, ఇత‌ర రాష్ట్రాల్లోని పార్టీల‌కు పెట్టుబ‌డి పెట్టే ప్ర‌తిపాద‌న కేసీఆర్ చేసిన‌ట్టు ఇటీవ‌ల న్యూస్ వ‌చ్చింది. వీట‌న్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేంద్రం రూ. 2వేల నోట్ ను ర‌ద్దు చేసింద‌ని తెలుస్తోంది. కానీ, ఎన్నిక‌ల ముందుగానే బ్లాక్ మ‌నీ రూపంలో ఉన్న రూ. 2వేల నోట్ల‌ను ఓట‌ర్ల‌కు పంపిణీ చేసే కార్య‌క్ర‌మాన్ని ఇప్పుడే మొద‌లు(BRS Lucky) పెట్టారని వినికిడి.

Also Read : BRS alliance : కేసీఆర్ మ‌హా కూట‌మి! రేవంత్ కు చిక్కులే!!

సామాన్యుల వ‌ద్ద రూ. 2వేల నోట్ ఇటీవ‌ల క‌నిపించ‌డంలేదు. కానీ, ఇప్పుడు బ్లాక్ లో ఉన్న రూ. 2వేల నోట్ బ‌య‌ట‌కు రావ‌డంతో బ్యాంకుల వ‌ద్ద క్యూలు క‌నిపిస్తున్నాయి. అంటే, రాజ‌కీయ పార్టీలు ముందుగానే గ్రామ స్థాయి క‌మిటీల ద్వారా డ‌బ్బు పంపిణీ ప్రారంభించార‌న్న‌మాట‌. ఇక ఏపీలోని వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను అందుకోసం రంగంలోకి దింపార‌ని తెలుస్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో ఏమోగానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మోడీ తీసుకున్న నిర్ణ‌యం కేసీఆర్, జ‌గ‌న్ నెత్తిన పాలుపోసిన‌ట్టు అయింద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు భావిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇప్పుడే డ‌బ్బు పంపిణీ ప్రారంభించ‌డం ద్వారా ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప‌నిలో ఉన్నార‌ని తెలుస్తోంది. సో..బీజేపీ వేసిన ఎత్తుగ‌డ ఏపీ, తెలంగాణ (BRS Lucky)రాష్ట్రాల్లో వ‌ర్కౌట్ కాద‌ని అంచ‌నా వేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్ట‌లేం.