BRS list strategy : KCR వ్యూహాల‌కు అర్థాలు వేరు.!

గాణ సీఎం కేసీఆర్ వ్యూహాలను (BRS list strategy) ఎవ‌రూ ప‌సిక‌ట్ట‌లేరు. అవునంటే కాద‌ని, కాదంటే ఔన‌నే రీతిలో ఆయన ఎత్తుగ‌డ ఉంటుంది.

  • Written By:
  • Updated On - August 21, 2023 / 05:05 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలను (BRS list strategy) ఎవ‌రూ ప‌సిక‌ట్ట‌లేరు. అవునంటే కాద‌ని, కాదంటే ఔన‌నే రీతిలో ఆయన ఎత్తుగ‌డ ఉంటుంది. ఒక్కో ఎన్నిక‌కు ఒక్కోలా వ్యూహం ఉంటుంద‌ని ఆయ‌న చెబుతుంటారు. ఈసారి సిట్టింగ్ ల్లో స‌గం మందికి టిక్కెట్లు ఉండ‌వ‌ని ప్ర‌ధాన మీడియా సైతం ఊద‌ర‌గొట్టింది. కానీ, అనూహ్యంగా కేసీఆర్ ఏడుగురి సిట్టింగ్ ల‌కు మిన‌హా అందరూ తిరిగి పోటీచేసేలా అవ‌కాశం ఇచ్చారు. ఇక్క‌డే కేసీఆర్ వ్యూహం ఏమిటి? అనేది బోధ‌ప‌డ‌దు.

తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలను (BRS list strategy)

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్ట్ ల‌ను కేసీఆర్ చంక్క‌న (BRS list strategy) పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ కామ్రేడ్ల‌ను దూరంగా పెట్టేశారు. కేవ‌లం ఎంఐఎం మాత్ర‌మే మిత్ర‌ప‌క్షం అంటూ ప్ర‌క‌టించారు. తొలి నుంచి స‌హ‌జ మిత్రునిగా ఎంఐఎంను ప‌క్క‌న పెట్టుకుని అంటు ముస్లిం ఇటు హిందూ ఓట్ల‌ను కేసీఆర్ పొందుతున్నారు. ఈసారి కూడా ఆ ఈక్వేష‌న్లో ఎలాంటి మార్పు లేదు. కానీ, సిట్టింగ్ ల‌కు టిక్కెట్లు ఇవ్వ‌డ‌మే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కార‌ణం, స‌రిగ్గా మూడు నెల‌ల క్రితం స‌గం మంది అవినీతికి పాల్ప‌డుతున్నారని కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు. తిరిగి వాళ్ల‌కే టిక్కెట్ల ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఎమ్మెల్యేల ప‌నితీరు మీద మూడు స‌ర్వేల‌ను

ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ ప్లీన‌రీ స‌న్నాహ‌క స‌మావేశం (BRS list strategy) సంద‌ర్భంగా ఎమ్మెల్యేల అవినీతి గురించి ప్ర‌స్తావించారు. స‌గం మంది ఎమ్మెల్యేలు అవినీతిప‌రుల‌ను తేల్చారు. ప్ర‌త్యేకించ ద‌ళితబంధు ప‌థ‌కంలో అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆగ్ర‌హించారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతానంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యేల ప‌నితీరు మీద మూడు స‌ర్వేల‌ను చేయించాన‌ని ఆ రోజు హెచ్చ‌రించారు. స‌గం మందికి పైగా అవినీతిలో కూరుకుపోయార‌ని, ఎన్నిక‌ల నాటికి మార్చుకుని గ్రాఫ్ పెంచుకోక‌పోతే టిక్కెట్ల ఇవ్వ‌న‌ని కూడా అప్ప‌ట్లో చెప్పారని పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ. దాని బేస్ చేసుకుని ప్రధాన మీడియా కూడా కేసీఆర్ స‌ర్కార్ అవినీతి మీద న్యూస్ ను వండివార్చింది. అంతేకాదు, క‌నీసం 30 మందికి టిక్కెట్ల రావ‌ని కోడై కూసింది.

ఏడుగురు సిట్టింగ్ ల‌కు మిన‌హా

సిట్టింగ్ ల‌తో ఎన్నిక‌ల‌కు రావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవ‌ల కేసీఆర్ కు స‌వాల్ విసిరారు. వాళ్ల‌తో ఎన్నిక‌ల‌కు కేసీఆర్ రాలేర‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. కానీ, రేవంత్ రెడ్డికి మైండ్ పోయేలా సిట్టింగ్ ల‌కు సీట్ల‌ను కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. కేవ‌లం ఏడుగురు సిట్టింగ్ ల‌కు మిన‌హా మిగిలిన అందరికీ టిక్కెట్ల‌ను ప్ర‌క‌టించారు. ఆ ఏడుగురిని కూడా బాధ‌తో తొల‌గించాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. అంటే, కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిన త‌రువాత ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరిగిందా? అంటే (BRS list strategy) దానికి బీఆర్ఎస్ అధిష్టానం సమాధానం చెప్పాలి.

Also Read : BRS Candidates List: బీఆర్ఎస్ మొదటి జాబితా అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ

మూడు స‌ర్వేల‌ను చేయించిన కేసీఆర్ వాటి ఆధారంగా టిక్కెట్ల‌ను సిట్టింగ్ ల‌కు కేటాయించారు. అంతేకాదు, 95 నుంచి 105 స్థానాల్లో విజ‌యం త‌మ‌దేన‌ని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. అంటే , ఈమూడు నెల‌ల్లోనే బీఆర్ఎస్ గ్రాఫ్ పెర‌గ‌డానికి కార‌ణాలు ఏమిటి? అనే ప్ర‌శ్న వేసుకుంటే, క‌నిపించే ఒకేఒక ప‌థ‌కం రైతు రుణ మాఫీ. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించిన విధంగా ల‌క్ష లోపు ఉన్న రుణాల‌ను ఒకేసారి ర‌ద్దు చేశామ‌ని కేసీఆర్ చెబుతున్నారు. అదే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిపిస్తుంద‌ని విశ్వ‌సిస్తున్నారు. అంతేకాదు, బీసీ బంధు, రైతు బంధు, ఉచిత విద్యుత్, మంచినీళ్లు త‌దిత‌రాల‌న్నీ ప్ర‌గ‌తి సూచ‌కాలు. వాటిని చూసి ఓట్లేస్తార‌ని కేసీఆర్ న‌మ్మ‌కం.

Also Read : BRS : హరీష్ రావు దుకాణం బంద్ చేయించే వరకు నేను నిద్రపోను – మైనంపల్లి హనుమంతరావు

సాధార‌ణంగా ఎన్నిక‌ల ఫ‌లితాలు ప‌లు అంశాల మీద ఆధార‌ప‌డ‌తాయి. కేవ‌లం అభివృద్ధిని చూసి మాత్ర‌మే ఓట్లు ప‌డ‌వు. సామాజిక ఈక్వేష‌న్లు, అవినీతి, ప‌రిపాల‌న, అభ్య‌ర్థుల ఎంపిక‌, ఎన్నిక‌ల ప్ర‌క్రియ త‌దిత‌రాల‌న్నీ ప్ర‌భావం చూపుతాయి. అభ్య‌ర్థుల ఎంపిక విష‌యాన్ని తీసుకుంటే చాలా మంది మీద వ్య‌తిరేక‌త ఉంది. అవినీతి ప్ర‌భావం క్షేత్ర‌స్థాయిలో ఎక్కువ‌గా ఉంద‌ని కేసీఆర్ కు స‌ర్వేల ద్వారా తెలుసు. కుటుంబ పాల‌న అనే స్లోగ‌న్ తెలంగాణ స‌మాజం మీద బాగా ఉంది. సామాజిక ఈక్వేష‌న్ల‌లో బీసీలకు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల‌కు అన్యాయం జ‌రిగింద‌ని ఫీలింగ్ ఆ వ‌ర్గాల్లో ఉంది. నిజంగా స‌ర్వేలు సిట్టింగ్ ల మీద పాజిటివ్ గా ఉంటే, కేసీఆర్ మీద కూడా ఉండాలి. కానీ, ఆయ‌న రెండు చోట్ల నుంచి పోటీ చేయ‌డానికి సిద్ద‌ప‌డ్డారు. గ‌జ్వేల్ సిట్టింగ్ స్థానంతో పాటు కామారెడ్డి నుంచి బ‌రిలోకి దిగుతున్నారు.అంటే, గెలుపు మీద ఆయ‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల ఆరోప‌ణ‌. ఈ అంశం ఎన్నిక‌ల్లో ఎలివేట్ కానుంది. ఇలాంటి పరిణామాల‌కు కేసీఆర్ వ‌ద్ద ఉన్న వ్యూహాలు ఏమిటో భ‌విష్య‌త్ ఎన్నిక‌ల్లో చూద్దాం.!