Site icon HashtagU Telugu

BRS Candidates List: బీఆర్ఎస్ మొదటి జాబితా అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ

BRS Candidates

New Web Story Copy (66)

BRS Candidates List: బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక వేటలో పడ్డారు. ఈ మేరకు ఈ రోజు ఆయన ఏ క్షణంలో అయినా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ ఈరోజు విలేకరులతో మాట్లాడనున్నారు.అయితే ఇప్పటికే దాదాపు అన్ని స్థానాలకు ఆయన అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. తొలి జాబితాలో 87 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశముంది. మిగిలిన 32 స్థానాల పేర్లను తర్వాత ప్రకటిస్తారని తెలుస్తుంది. కాగా 95 శాతం మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మళ్లీ రంగంలోకి దించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత 10-12 నియోజకవర్గాల్లో మాత్రమే మార్పులు చేసే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మెదక్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డిలలో ఒక్కొక్కరికి టికెట్ నిరాకరించే అవకాశం ఉంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటం, అలాగే టిక్కెట్ల కోసం ఎక్కువమంది అభ్యర్థులు ఉండటంతో కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత పోరు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నియోజక వర్గంలో అభ్యర్థుల ప్రకటన కాస్త ఆలస్యం కానుంది.119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి నవంబర్-డిసెంబరులో ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: CBN Strategy : `పొత్తు`పై చంద్ర‌బాబు సాము! BJPకి దూరంగా.!