రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని ప్రచారం చేయకుండా చేయాలనీ బిఆర్ఎస్ (BRS) డిమాండ్ చేస్తుంది. ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని బిఆర్ఎస్ ఆరోపిస్తుంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ కు మరో 17 రోజులు మాత్రమే ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని మరింత స్పీడ్ చేస్తూ..ప్రత్యర్థి పార్టీల ఫై విరుచుకపడుతున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల వార్ నడుస్తుంది. ఇద్దరు ఎక్కడ తగ్గడం లేదు. విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా అధికార పార్టీ BRS లీగల్ టీం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తక్షణమే ఆయనను ఎన్నికల ప్రచారం చేయకుండా తొలగించాలంటూ CEC వికాస్ రాజ్ ను కలిసి ఫిర్యాదు చేసారు. రేవంత్ రెడ్డి చేసే వ్యాఖ్యలు BRS క్యాడర్ ను రెచ్చగొట్టేలా ఉన్నాయని విజ్ఞప్తిలో తెలిపారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా దుబ్బాక మరియు అచ్చంపేట లో దాడులు జరిగినట్లు ఈ ఫిర్యాదు లేఖలో వికాస్ రాజ్ దృష్టికి తీసుకెళ్లారు.
Read Also : Janareddy : జానారెడ్డి నామినేషన్ ను రిజెక్ట్ చేసిన ఎన్నికల అధికారులు