Site icon HashtagU Telugu

KCR : రేవంత్ ఫై ఎటాక్ పెంచిన బిఆర్ఎస్ నేతలు

Former CM KCR

Kcr Cash

తెలంగాణ లో బిఆర్ఎస్ నేతలు మళ్లీ ఫామ్ లోకి వస్తున్నారా..? సైలెంట్ గా ఉంటె ప్రజలు పూర్తిగా మరచిపోతారని..గళం విప్పాల్సిన సమయం వచ్చిందని ఫిక్స్ అయ్యారా..? కాంగ్రెస్ ఫై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారా..? వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని అధినేత కేసీఆర్ సూచించారా..? అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది నేతలు సైలెంట్ అయ్యారు. కొంతమంది గెలిచినా , ఓడిన నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లిన కానీ ఉన్న వారు ఎలాంటి కామెంట్స్ చేయకపోగా..అసలు మీడియా చూద్దామన్నా కానీ కనిపించడం లేదు. దీంతో ఆయా నియోజవర్గ ప్రజలు , బిఆర్ఎస్ శ్రేణులు అసలు నేతలు ఉన్నారా..? పోయారా..? అనే విధంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫై కూడా ప్రజల్లో , నిరుద్యోగుల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఫై నిరుద్యోగులు , పెన్షన్ దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి అయినప్పటికీ ఇంకా హామీలు నెరవేర్చలేదని , ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఎలాంటి నోటిఫికేషన్ లు విడుదల చేయలేదని వారంతా ఆందోళనలు చేస్తున్నారు. ఇక కరెంట్ కటింగ్ లు సైతం ప్రజల్లో ఆగ్రహం నింపుతున్నాయి. గత ప్రభుత్వమే బాగుందని , కేసీఆర్ సారే మంచి చేసారని పల్లెల్లో రైతులు , పెద్దవారు చెపుతుండడం తో దీనిని క్యాష్ చేసుకోవాలని బిఆర్ఎస్ చూస్తుంది.

ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని , కాంగ్రెస్ ప్రభుత్వం ఫై పోరాటం ఉదృతం చేయాలనీ అధినేత కేసీఆర్ నేతలకు సూచించారు. ఇంకా ఓటమి లో ఉంటె ముందుకు వెళ్లలేమని , ఓటమి , గెలుపు అనేది సమానంగా చూడాలని..ఓటమి తోనే ఆగిపోవద్దని, ప్రజల్లో బిఆర్ఎస్ ఫై నమ్మకం పెంచాలని సూచించారు. విద్యుత్‌, సాగునీరు, వ్యవసాయ తదితర రంగాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా కొనసాగిందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్రవంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్ పాలన కావాలని కోరుకున్నారని నేతలకు గుర్తు చేసారు. ఇక నుండి నేతలు తమ స్పీచ్ పెంచాలని , ప్రభుత్వం ఫై పోరాటం చేయాలనీ పిలుపునిచ్చారు. కేసీఆర్ పిలుపు , సూచనల మేరకు నేతలు సైతం స్పీచ్ పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి తన గళాన్ని విప్పుతూ ..ప్రజల్లో నమ్మకం పెంచుకుంటున్నారు. చూద్దాం బిఆర్ఎస్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో..

Read Also : BRS New Plan: హైద‌రాబాద్‌లో ప‌ట్టు కోల్పోకుండా బీఆర్ఎస్ న‌యా ప్లాన్‌..!