Site icon HashtagU Telugu

TS : ఈసీని కలిసేందుకు హస్తినకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు..!

Election preparation

TRS పేరును BRS గా మారుస్తూ బుధవారం చేసిన చేసిన తీర్మానం కాపీని ECకి సమర్పించేందుకు టీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీకి బయలుదేరింది. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ నేతృత్వంలో బృందం ఢిల్లీకి వెళ్లింది. గురువారం ఈసీకి వీరు తీర్మానం కాపీని అందించనున్నారు. జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టినందుకు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గామార్చాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఈ మేరకు బుధవారం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ..ఏకవాక్య తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశంలో పాల్గొన్న 283 మంది ప్రతినిధులు ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానాన్ని సీఎం కేసీఆర్ చదివి వినిపించారు.

ఈ తీర్మానం కాపీతో బోయినపల్లి వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం హస్తినకు బయలుదేరింది. ఈ బృందంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు. గురువారం ఉదయం 11గంటలకు బీఆర్ఎస్ ప్రతినిధులు ఈసీ అధికారులను కలిసి తీర్మాణ కాపీని అందిస్తారు. 2024లో ఎన్నికల్లో దేశంలో పలు చోట్ల బీఆర్ఎస్ పోటీ చేయనుంది. ఇతర రాష్ట్రాల్లోనూ తమతో మిత్రులుగా పార్టీలతో కలిసి బీఆర్ఎస్ పోటీ చేసే ఛాన్స్ ఉంది.

Exit mobile version