KTR : కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా బంజారాహిల్స్ నందినగర్ లోని కేటీఆర్ నివాసానికి హరీశ్ రావు, కవిత, మదుసూదనచారి, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. మరోవైపు కేటీఆర్ లీగల్ టీమ్ తో చర్చలు జరుపుతున్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి వస్తే.. ఏం చేయాలి అనే దానిపై బీఆర్ఎస్ నేతలు లీగల్ టీమ్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఏసీబీ ఏం చేస్తుందనేది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఫార్ములా ఈ రేసు కేసులో ఇప్పటికే ఏ1గా పేర్కొనగా.. ఏసీబీ, ఈడీ వరుసగా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా.. నిన్న ఏసీబీ విచారణకు హజరయ్యేందుకు వెళ్లిన కేటీఆర్.. తన లాయర్‌ను అనుమతించలేదన్న కారణంతో తిరిగి వచ్చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. కేటీఆర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలకు ఉపక్రమించారు. గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాస్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఏసీబీ సోదాలు ప్రస్తుతం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారాయి. తర్వాత ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.
అయితే తన ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతాయ నిన్నఉదయమే కేటీఆర్ మీడియాతో చెప్పటం గమనార్హం. ఆయన చెప్పినట్టుగానే ఏసీబీ అధికారులు సాయంత్రానికి ఆయన నివాసంలో సోదాలకు ఉపక్రమించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేబినెట్ ఆమోదం లేకుండానే డబ్బులు ముట్టజెప్పారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ సమయంలో మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను ఏ1గా ఏసీబీ చేర్చింది. ఈ క్రమంలోనే జనవరి 02న నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం సోమవారం ఉదయమే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
Read Also: Earthquake Alerts : మీ ఫోన్‌కు భూకంపాల అలర్ట్స్ రావాలా ? ఈ సెట్టింగ్స్ చేసుకోండి