Site icon HashtagU Telugu

Chandrababu : బిఆర్ఎస్ నేతలు చంద్రబాబు కు మద్దతు తెలుపడం వెనుక అసలు కారణాలు ఏంటి..?

BRS leaders support chandrababu

BRS leaders support chandrababu

స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case) లో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 10 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ చేసిన దగ్గరి నుండి ఏపీలోని తెలుగు వారే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ..తమ సపోర్ట్ ను తెలుపుతున్నారు. కేవలం తెలుగు వారే కాదు పలు దిగ్గజ సంస్థల నేతలు సైతం..చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా బిఆర్ఎస్ నేతలు (BRS Leaders Support) సైతం రోడ్ల పైకి వచ్చి చంద్రబాబు కు సపోర్ట్ గా నిలువడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం వీరంతా చంద్రబాబు స్కూల్ నుండే రాజకీయాల్లోకి వచ్చినవారు కొంతమందైతే..కమ్మ ఓటర్లను తృప్తి పరిచేలా.. ఆంధ్రా సెటిలర్లను మచ్చిక చేసుకునేలా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్న వారు మరికొంతమంది. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గరి నుండి మంత్రులుగా , ఎమ్మెల్యే లుగా కొనసాగుతున్న చాలామంది చంద్రబాబు శిష్యులే. అందుకే వారంతా బాబు కు సపోర్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

టీడీపీ మద్దతు లేకపోతే ఎల్పీనగర్‌ లో గెలవడం అసాధ్యమని..తెలిసిన ఎల్బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి (MLA Sudheer Reddy) స్వయంగా ర్యాలీకి నాయకత్వం వహించారు. సుధీర్‌రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు చాలా దగ్గర. అలాగే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కూడా బాగా దగ్గరే. అయినా కూడా చంద్రబాబుకు సపోర్ట్ గా ర్యాలీ నిర్వహించారు. అలాగే మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) సైతం చంద్రబాబుది అక్రమ అరెస్ట్‌ అని జగన్ తన గొయ్యి తాను తవ్వుకున్నారని విమర్శలు చేసారు. ఇక ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay), వనమా వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. నిజామాబాద్‌ , నల్లగొండ, కోదాడ వంటి చోట్ల బీఆర్‌ఎస్‌ నాయకులు భారీ ర్యాలీలు తీశారు. ఇక హైదరాబాద్‌లోని కుషాయిగూడ సహా చాలా కాలనీల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. అపార్టుమెంట్లు వారీగా మాట్లాడుకుని చంద్రబాబుకు సంఘిభావం చెబుతున్నారు.

Read Also : Made In India : ‘మేడ్ ఇన్ ఇండియా’.. రాజమౌళి నెక్స్ట్ మూవీ విశేషాలివీ

అయితే సపోర్ట్ గా నిలిచినా నేతల్లో కొంతమంది టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారే. బాబు వద్దనే వీరు రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. అందుకే ఇలా తమ గురువుపై అభిమానాన్ని చాటుకుంటున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు సపోర్ట్ చేయడం వెనుక వారు వహిస్తున్న నియోజకవర్గాల్లో కమ్మ ఓటర్లు, ఆంధ్రా సెటిలర్లు ఎక్కువ. త్వరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో వారికి విరుద్ధంగా ఉంటే.. ఇబ్బందులు తప్పవు. అందుకే కమ్మ ఓటర్లను తృప్తి పరిచేలా.. ఆంధ్రా సెటిలర్లను మచ్చిక చేసుకునేలా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి బిఆర్ఎస్ నేతలు చంద్రబాబు కు సపోర్ట్ చేయడం..వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.