BRS : నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు

ఉచిత విద్యుత్ పై పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ పార్టీ

  • Written By:
  • Updated On - July 12, 2023 / 01:54 PM IST

ఉచిత విద్యుత్ పై పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు సిద్ద‌మైయ్యారు. మండల, జిల్లా, పట్టణ కేంద్రాల్లోకాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. నిన్న నేడు రెండు రోజులపాటు కార్యక్రమాలు ఈ కార్య‌క్ర‌మాన్నిగులాబీ నేత‌లు నిర్వ‌హిస్తున్నారు. హైదరాబాద్ విద్యుత్ సౌదా మందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జ‌ర‌గ‌నుంది. ఈ నిర‌స‌న‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత హాజ‌రుకానున్నారు. మళ్లీ కాంగ్రెస్ వస్తే కారు చీకట్లో అంటూ బీఆర్ఎస్ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు.పెద్ద ఎత్తున రైతులను నిరసనలో భాగస్వాములను చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పోటాపోటీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆయా జిల్లా నేతలు కార్యక్రమాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ అడ్వాంటేజ్ గా తీసుకుంది. కాంగ్రెస్ పై ఎదురుదాడి లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. మళ్లీ కాంగ్రెస్ వస్తే రైతులకు కరెంటు కష్టాలు త‌ప్ప‌వంటూ ప్ర‌చారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నైజాన్ని ప్రజల్లో ఎండగట్టేలా కార్యక్రమాలు చేయాలని బీఆర్ఎస్ నేత‌లకు కేటీఆర్ పిలుపునిచ్చారు.