BRS Leaders: ఫోన్ ట్యాపింగ్ సిల్లీ ఇష్యూ.. లీకు వార్తలపై లీగల్ యాక్షన్ తీసుకుంటాం

  • Written By:
  • Publish Date - May 29, 2024 / 08:30 PM IST

BRS Leaders:  తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, మాజీ కార్పోరేషన్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో ప్రజాప్రతినిధిని కొనుగోలు చేయడానికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. లైవ్ లో దొరికిన రేవంత్ కు లై డిటెక్టర్ పెడితే ఎలా ఉంటుంది ? కేసీఆర్ కు లై డిటెక్టర్ పెడితే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయని రేవంత్ మాట్లాడడం అవివేకం. ముఖ్యమంత్రిగా ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వారిని అలా మాట్లాడతారా ? చంద్రబాబు, వైఎస్ హయాంలో జరిగిన ఎన్ కౌంటర్లు ఫలానా వాళ్లు చెబితే చేశామని ఎవరైనా పోలీసు అధికారులు చెప్తారా ? ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం తెలిసినా దాన్ని పట్టించుకోలేదు’’ వారు మండిపడ్డారు.

‘‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సిల్లీ ఇష్యూగా పక్కనపెట్టాం. లీకు వార్తలు ఇలాగే కొనసాగితే లీగల్ గా ముందుకెళ్తాం. లీకులతో వార్తలు రాయించి సూత్రధారులు, పాత్రధారులను నిర్దారిస్తున్నారు. అభియోగాలు ఎప్పుడూ చట్టపరిధిలో అంగీకరించబడవు .. ఏ ఉత్తర్వులు, ఏ ప్రాతిపదికన జరిగాయి అన్నది కోర్టులో నిర్దారణ అవుతుంది. ఆపస్తుతి .. పరనింద అన్న ఆలోచనతో ప్రభుత్వం సాగుతుంది. సినిమా సంగతి ఏమో గానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యూస్ రీల్స్ ఎక్కువయ్యాయి. కొన్ని రోజులు కాళేశ్వరం మీద అబద్దాలు ప్రచారం చేశారు .. కేవలం రాజకీయ దుగ్దతో అభాండాలు మోపారు. ఇప్పుడు మల్లన్న సాగర్ నుండి మూసీకి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు ఏడు టీఎంసీలు తెస్తాం అంటున్నారు’’ అని వారు అన్నారు.

‘‘కాళేశ్వరం విఫల ప్రాజెక్టు అయితే మరి నీళ్లెలా తెస్తారు. కొన్ని రోజులు కాళేశ్వరం విషప్రచారం .. పేకాటలో జోకర్లా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరమీదకు తెస్తున్నారు. కానీ ఇంత వరకు ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఒక్క అధికారిక ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ వైఫల్యాలు తెరమీదకు రాగానే డైలీ సీరియల్లా ఏదో ఒక లీకు విడిచి ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యవస్థలో భాగంగా ఆయా సంస్థల పరిధిలో జరిగేది. రోజు వారీ లీకులతో వార్తలు రాయించడం కూడా నేరమే. వార్తలు రాయించడంతో పాటు తీర్పులు కూడా ఇచ్చేస్తున్నారు. కేసీఆర్ ను, బీఆర్ఎస్ నేతలను బద్నాం చేయడమే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది. ఇందిర హయాంలో సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు .. నా ఫోన్ ట్యాప్ అవుతుందని గతంలో చిరంజీవి చెప్పాడు’’ అని వారు గుర్తు చేశారు.