మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Irrigation Minister Uttam Kumar Reddy)కి పితృవియోగం కలిగింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తం రెడ్డి (Purushottam Reddy).. ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ సందర్బంగా పురుషోత్తంరెడ్డి పార్థివదేహానికి రాజకీయ పార్టీల నేతలు నివాళ్లు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, సంజయ్, వద్ది రవిచంద్ర తదితరులు నివాళులర్పించి ఉత్తమ్, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
అలాగే పురుషోత్తం రెడ్డి మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. పురుషోత్తం రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థలం ప్రస్తుతం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల. పురుషోత్తమ్ రెడ్డికి దేశ భక్తి ఎక్కువ.. అందుకే కొడుకునే ఆర్మీ పంపించారని అంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. పురుషోత్తమ్ రెడ్డి బౌతికకాయానికి నివాళులర్పించేందుకు పలువురు గ్రామం నుంచి హైదరాబాద్ వస్తున్నారు.
Read Also : International Day Of Awareness Of Food Loss And Waste : మనకు తినే హక్కు ఉంది కానీ వృధా చేసే హక్కు లేదు..!