Site icon HashtagU Telugu

Kadiyam Kavya : కడియం కావ్యకి అసమ్మతి సెగ..

Kadiyam Kavya

Kadiyam Kavya

రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ (BRS) పరిస్థితి ఏమాత్రం బాగాలేదు..అసెంబ్లీ ఎన్నికల వరకు ఓ లెక్క..ఇప్పుడు ఓ లెక్క గా మారింది. కొద్దీ రోజులైతే బిఆర్ఎస్ లో తండ్రి కొడుకులు మాత్రమే ఉన్న ఆశ్చర్య పోనవసరం లేదనే అభిప్రాయం అంత వ్యక్తం చేస్తున్నారు. ఆ రేంజ్ లో సీఎం రేవంత్ (Revanth) బిఆర్ఎస్ ను ఖాళీ చేస్తున్నారు. కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేశామని ఓపెన్ గా చెప్పడం తో..బిఆర్ఎస్ నేతలంతా క్యూ కడుతున్నారు. మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఇలా కీలక నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. కేవలం నేతలే కాదు పల్లెలో సైతం కాంగ్రెస్ లోకి వలసల పర్వం పెరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బిఆర్ఎస్…పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చేస్తున్నప్పటికి ఆ ఛాన్స్ కాంగ్రెస్ ఇవ్వదనే అనిపిస్తుంది. రీసెంట్ గా బిఆర్ఎస్ పలువురు లోక్ సభ అభ్యర్థులను ప్రకటించగా..వారిలో కడియం కావ్య ఒకరు. కాంగ్రెస్ పార్టీ వరుసపెట్టి బిఆర్ఎస్ నేతలకు వరుస ఆఫర్లతో తమ పార్టీలోకి లాగేసుకుంటున్న నేపథ్యంలో కడియం కు అలాంటి ఆఫర్లే వచ్చాయి. దీంతో ఆయన ఎక్కడ పార్టీని వీడతారో అని.. కేసీఆర్ ..వరంగల్ పార్లమెంట్ టిక్కెట్‌ను కడియం శ్రీహరి కూతురు కావ్య (Kadiyam Kavya)కు ఇచ్చారు. దీంతో ఆ టికెట్ ఫై అసంతృప్తి చెలరేగుతోంది. ఈ టికెట్ కోసం BRSలోని ముఖ్య నేతలు, ఉద్యమకారులు పోటీ పడ్డారు. కానీ కేసీఆర్ మాత్రం వారందర్ని కాదని కావ్య కు ఇవ్వడం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తాటికొండ రాజయ్య ఇప్పటికే పార్టీని వీడగా, దయాకర్ కాంగ్రెస్‌లోకి, ఆరూరి రమేష్ బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన బీఆర్ఎస్ లీడర్లు, ఉద్యమకారులు.. కావ్య అభ్యర్థిత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యేకంగా ఓ మీటింగ్ పెట్టి.. కేసీఆర్‌కు తమ నిరసన తెలపాలని డిసైడ్ అయ్యారు. కానీ ప్రస్తుతం కవిత అరెస్ట్..కేసీఆర్ ఆ ఆందోళనలో ఉండడం తో ఇప్పుడు కేసీఆర్ కలవడం మంచిది కాదని వారంతా ఆగిపోయారు. మరి కేసీఆర్ ని కలుస్తారా…లేక బిఆర్ఎస్ దూరం అవుతారా అనేది చూడాలి.

Read Also : Surabhi: చావు అంచుల వరకు వెళ్ళొచ్చిన హీరోయిన్.. జస్ట్ మిస్ చనిపోయేదాన్నంటూ!