BRS : ‘కంటోన్మెంట్‌’ ను వదిలేసిందా..?

లోక్ సభ ఎన్నికల కారణంగా కంటోన్మెంట్ లో బిఆర్ఎస్ సందడే కనిపించకుండా అయిపోయింది

  • Written By:
  • Publish Date - May 1, 2024 / 11:04 AM IST

తెలంగాణ లో మే 13 న 17 లోక్ సభ స్థానాలతో పాటు ‘కంటోన్మెంట్‌’ కు ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుండి లాస్య బరిలోకి దిగి విజయం సాధించింది. కానీ రెండు నెలల క్రితం కారు ప్రమాదంలో ఆమె మృతి చెందింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆమె సోదరి నివేదిత (Niveditha)ను బిఆర్ఎస్ పార్టీ బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుండి నారాయణన్ శ్రీ గణేష్‌ (Narayanan Sri Ganesh), బీజేపీ (BJP) నుంచి వంశీ తిలక్ బరిలోకి దిగారు. గత కొద్దీ రోజులుగా వీరంతా ప్రచారం చేస్తూ వస్తున్నారు. బిజెపి , కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున తమ అధినేతలు , పార్టీ అగ్ర నేతలు ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటుంటే…బిఆర్ఎస్ అధినేత, అగ్ర నేతలు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నివేదిత మాత్రమే తమ కార్యవర్గం తో ప్రచారం చేస్తూ వస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ లోక్ సభ ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీకి ఎంతో కీలకం అనే సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడడం..ఓటమి తర్వాత పెద్ద ఎత్తున నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం తో రాష్ట్రంలో ఇక బిఆర్ఎస్ పని అయిపోయిందని , కారు షెడ్డు కు వెళ్లిందని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తుంది. దీంతో గులాబీ బాస్ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓ పక్క ఎండలు దంచికొడుతున్న తన వయసును , ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కేసీఆర్ బస్సు యాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్రలో ప్రజలు కేసీఆర్ కు బ్రహ్మ రథం పడుతున్నారు. ప్రజల నుండి వస్తున్న స్పందన తో కేసీఆర్ ..కాంగ్రెస్ ఫై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చింది..కరువు వచ్చిందని, రైతులకు రైతుభీమా , రైతు బంధు ఇవ్వడం లేదని , కరెంట్ కటింగ్ లు మొదలుపెట్టిందని , వరి కొనుగోలు చేయడం లేదని , నాల్గు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫై ప్రజలకు వ్యతిరేక వచ్చిందని చెపుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

ఇలా తన ఫోకస్ అంత లోక్ సభ ఎన్నికల పైనే పెట్టారు. హరీష్ రావు , కేటీఆర్ లు సైతం పూర్తిగా లోక్ సభ ప్రచారంలోనే మునిగిపోయారు తప్ప కంటోన్మెంట్‌ వైపు చూడడం లేదు. దీంతో పాపం నివేదిత ఒక్కతే నియోజకవర్గం చుట్టేస్తూ గెలిపించాలని ఓటర్లను కోరుతుంది. మరోపక్క కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల్లో నియమించిన ఇన్చార్జీనే మళ్లీ నియమించింది. దీంతో ఆయన పార్టీ సీనియర్లను, కేడర్ ను కలుపుకొనిపోవడం లేదని, పార్టీలో ఉండేవారు ఉంటారు.. పోయేవారు పోతారనే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన తీరుపై స్థానిక నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇలా పార్టీలో అంతర్గత విభేదాలు , లోక్ సభ ఎన్నికల కారణంగా కంటోన్మెంట్ లో బిఆర్ఎస్ సందడే కనిపించకుండా అయిపోయింది. మరి ఇప్పటికైనా బిఆర్ఎస్ అగ్ర నేతలు కంటోన్మెంట్ లో ప్రచారం చేస్తే కానీ పార్టీకి ఊపురాదని అంటున్నారు.

Read Also : Bomb Threat Emails : పెద్దసంఖ్యలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. రాజధానిలో కలకలం