Congress : కాంగ్రెస్ గూటికి చేరిన బిఆర్ఎస్ కీలక నేతలు..

బిఆర్ఎస్ (BRS) పార్టీ కి వరుస షాకులు తగ్గడం లేదు..అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఘోర ఓటమి చవిచూసిన గులాబీ పార్టీ..ఆ తర్వాత కూడా వరుసపెట్టి నేతలు పార్టీని విడుత పార్టీ బలాన్ని తగ్గిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు పార్టీ కి బై బై చెప్పి..కాంగ్రెస్ లో చేరగా..ఈరోజు రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి దీపాదాస్ సమక్షంలో ఈరోజు మరికొంతమంది బిఆర్ఎస్ కీలక నేతలు చేరారు. వికారాబాద్​ జడ్పీ ఛైర్​పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి , […]

Published By: HashtagU Telugu Desk
Brs Leaders Join Congress

Brs Leaders Join Congress

బిఆర్ఎస్ (BRS) పార్టీ కి వరుస షాకులు తగ్గడం లేదు..అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఘోర ఓటమి చవిచూసిన గులాబీ పార్టీ..ఆ తర్వాత కూడా వరుసపెట్టి నేతలు పార్టీని విడుత పార్టీ బలాన్ని తగ్గిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు పార్టీ కి బై బై చెప్పి..కాంగ్రెస్ లో చేరగా..ఈరోజు రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి దీపాదాస్ సమక్షంలో ఈరోజు మరికొంతమంది బిఆర్ఎస్ కీలక నేతలు చేరారు. వికారాబాద్​ జడ్పీ ఛైర్​పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి , హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు ఉదయం బీఆర్​ఎస్​ పార్టీకి జడ్పీ ఛైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్‌ రెడ్డి రాజీనామా రాసి, లేఖను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే. అదేవిధంగా హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిలు కూడా హస్తం గూటికి చేరారు. గాంధీభవన్‌లో దీప్‌దాస్‌ మున్షీ వారికి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు.

ఫిబ్రవరి 8న పట్నం మహేందర్ రెడ్డి దంపతులిదద్దరు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే వీరు పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. వాస్తవానికి పట్నం మహేందర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికలకు ముందు ఆయనకు కేసీఆర్ మంత్రి పదవిని కొట్టబెట్టారు. దీంతో వెనక్కి తగ్గారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ పరిధిలో నలుగురు కాంగ్రెస్ నుంచి గెలవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇప్పుడు చేరిపోయారు.

Read Also : Urine : మూత్రమే కదా అని ఈజీగా వదిలేయకండి..అందులో కరెంట్ ఉంది..!!

  Last Updated: 16 Feb 2024, 04:42 PM IST