TG : ‘కారు’ విలవిల..ఉందామా..పోదామా అనేది తేల్చుకోలేకపోతున్న నేతలు

ఈ రెండు పార్టీల మధ్య బిఆర్ఎస్ విలవిలాడుతుంది. అధికారం కోల్పోవడం తో బిఆర్ఎస్ లో ఉన్న నేతలంతా కాంగ్రెస్ , బిజెపి పార్టీలోకి చేరుతున్నారు

  • Written By:
  • Publish Date - March 24, 2024 / 01:26 PM IST

రాష్ట్రంలో ‘బిఆర్ఎస్’ (BRS) పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసి..తొలి సీఎంగా బాధ్యత చేపట్టిన కేసీఆర్ (KCR)..తనదైన నిర్ణయాలతో..రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసారు. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని పదేళ్ల పాటు సీఎం గా బాధ్యతలు నిర్వర్తించారు. మూడోసారి సీఎం గా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావించారు. కానీ ప్రజలు మాత్రం మార్పు కోరారు.

ఇక అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..తనదైన దూకుడు కనపరుస్తూ దూసుకెళ్తుంది..ఇదే క్రమంలో కేంద్రంలో ఉన్న బిజెపి (BJP) సైతం మరోసారి అధికారం కోసం తహతహలాడుతోంది. ఇలా ఈ రెండు పార్టీల మధ్య బిఆర్ఎస్ విలవిలాడుతుంది. అధికారం కోల్పోవడం తో బిఆర్ఎస్ లో ఉన్న నేతలంతా కాంగ్రెస్ , బిజెపి పార్టీలోకి చేరుతున్నారు. ఒకప్పుడు కేసీఆర్ వెంట నడిచి..కీలక పదవులు అనుభవించిన వారు సైతం బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం తో కేసీఆర్ ఆలోచనలో పడ్డారు. ఇదే క్రమంలో కేసీఆర్ (KCR) పాలనలో అక్రమాలపై విచారణలు, మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) కేసులో కవిత (MLC Kavitha) అరెస్ట్‌తో పార్టీ మరింత పార్టీ విలవిలాడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ వ్యవహరించిన తీరు చూసిన తెలంగాణ ప్రజలు ప్రస్తుత పరిస్థితులు చూసి అయ్యో పాపం అనే పరిస్థితులు కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ భజన చేసిన నాయకులు.. ప్రస్తుతం ఆ పార్టీని వీడి బీజేపీ, కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. ఐదేళ్లపాటు బీఆర్‌ఎస్‌కు మళ్లీ అధికారం వచ్చే అవకాశం లేదు. ఐదేళ్ల తర్వాత రాజకీయం ఎలా ఉంటుందోనని.. నాయకులంతా సేఫ్ జోన్ కోసం అధికారంలో ఉన్న పార్టీల్లో చేరిపోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో బిఆర్ఎస్ పార్టీ కి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కరవయ్యారు. గతంలో బీఆర్‌ఎస్ టికెట్ కోసం పోటీపడే పరిస్థితి నుంచి.. ప్లీజ్ ఎన్నికల్లో పోటీ చేయండనే స్థాయికి చేరుకుంది. కొంతమంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ పార్టీ టికెట్ ఇస్తుందని తెలిసినా.. ఇక్కడ ఉంటే గెలవలేమనే అంచనాతో.. ఎన్నికలకు ముందే బీజేపీ, కాంగ్రెస్‌లో చేరి టికెట్లు తెచ్చుకున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేష్ బీజేపీలోకి వెళ్లి టికెట్స్ దక్కించుకోగా.. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి ఎంపీ టికెట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక ప్రస్తుతం బిఆర్ఎస్ లో ఉన్న కొద్దీ మంది కూడా పార్టీ లో కొనసాగాలా..లేక పార్టీని వీడిపోవాలా..? అనే ఆలోచన చేస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ను వీడి బిఆర్ఎస్ లోకి వచ్చిన నేతల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కాంగ్రెస్ లోనే ఉంటె ఏదొక పదవి దక్కేది..అనవసరంగా కేసీఆర్ ను నమ్ముకొని వచ్చామని సన్నిహితుల వద్ద చెప్పుకొని బాధపడుతున్నారట.

Read Also : Mamitha Baiju : హిట్టు పడింది రెమ్యునరేషన్ డబుల్ చేసింది.. వారెవా..!