తమ పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంక్‌బండ్‌పై బీఆర్‌ఎస్ (BRS) ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్‌ఎస్ ()BRS నేతలను , శ్రేణులను పోలీసులు అరెస్టులు(Police) చేస్తున్నారు. అర్థరాత్రి నుంచే నాయకులను హౌస్ అరెస్టులు చేయడంతోపాటు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ ధర్నాకు అనుమతి లభించకపోవడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటున్న బీఆర్‌ఎస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డగించారు. పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిని దగ్గరలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల చర్యలపై బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హక్కులను హరించడానికి ఇది ప్రభుత్వం తీసుకున్న చర్యగా వారు ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం కోసం నిరసనలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని నేతలు మండిపడ్డారు. ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను అక్కడికి చేరకుండా నిరోధించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు ఇతర ప్రాంతాల్లోనూ చిన్నచిన్న నిరసనలు చేపడుతున్నారు. మరోవైపు పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.
అంతకు ముందు ఏంజరిగిందంటే..
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తమ ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడి పెరిగింది. ఆయనను రాత్రి వరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉంచి, నోటీసులు ఇచ్చి బయటకు పంపకుండా రిమాండ్‌కు తరలించే ప్రయత్నం చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేయడానికి బంజారాహిల్స్, టాస్క్‌ఫోర్స్, గచ్చిబౌలి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి అక్కడికి చేరుకుని ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల ఆరోపణలు చేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు హరీశ్‌రావు సహా పలువురు నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇలా అక్రమ అరెస్ట్ లకు నిరసనగా ఈరోజు ట్యాంక్‌బండ్‌పై బిఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది.
Read Also : Governor Congratulated CM Revanth: సీఎం రేవంత్‌ను అభినందించిన గవర్నర్.. ఎందుకంటే?