Kavitha : కవితపై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం..బిజెపి కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రశంసలు

Kavitha : కవితపై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం..బిజెపి కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రశంసలు

Published By: HashtagU Telugu Desk
Kavitha Letter Clarty

Kavitha Letter Clarty

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)పై అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ (Takkellapalli Ravinder) రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కవిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని, ఆమె తీరు క్షమించరానిదని రవీందర్ స్పష్టం చేశారు. “కవితకు అంత ఆవేశం ఎందుకు? కాళేశ్వరం అంశంపై కేసీఆర్ స్వయంగా మాట్లాడతారు కదా? ఆయన్నే టార్గెట్ చేస్తూ మాట్లాడటం దేవుడిని దూషించడమే” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. లేఖ లీక్ వ్యవహారంపై ఓపికగా ఎదురు చూడాల్సిందిగా సూచించారు. ఈ వ్యాఖ్యలతో పార్టీ అంతర్గత విభేదాలు బహిరంగమవుతున్నాయన్న భావన తెరపైకి వచ్చింది.

Kavitha : కేసీఆర్ నా లీడర్ .. కాకపోతే అంటూ కవిత సంచలనం

కాగా బిఆర్ఎస్ నేతలు కవిత తీరు పై మండిపడుతుంటే..బిజెపి మాత్రం ప్రశంసిస్తున్నారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పెద్ద ప్యాకేజీ వస్తే తమ పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్‌లో కలిసిపోతారని చెప్పారు. గతంలో ఇదే తరహా పరిణామాలతో బీజేపీకి నష్టం జరిగిందని గుర్తుచేశారు. “తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం మా పార్టీ నేతలే” అంటూ విమర్శలు గుప్పించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సస్పెన్షన్ భయంతో నోరు మూసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీలోని అంతర్గత సమస్యలపైనా దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇక కవిత అంశంపై స్పందించేందుకు కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరాకరించారు. “ఆమె నా స్థాయికి సంబంధించిన వ్యక్తి కాదు. కవిత ఇష్యూ గురించి నన్ను అడగకండి” అంటూ స్పష్టం చేశారు. అదేవిధంగా కవిత అక్రమాస్తుల ఆరోపణలు చేయడం, తన తండ్రి, అన్న, బావల గురించి మాట్లాడడం సరైంది కాదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో మంచి ప్రజాపాలన కొనసాగుతోందని చెబుతూ, విమర్శలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలన్న స్పష్టతను వ్యక్తం చేశారు. కవిత వ్యాఖ్యలతో మూడు ప్రధాన పార్టీలలో చర్చలు, దుయ్యుబాట్లు నడుస్తున్నాయి.

Supreme Court : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు

  Last Updated: 29 May 2025, 02:32 PM IST