ఎన్నికల సమయంలో తెలంగాణ (Telangana) లో ఐటీ రైడ్స్ (IT Rides) అనేవి కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల ఇళ్లలో , ఆఫీస్ లలోనే కాకుండా అధికార పార్టీ బిఆర్ఎస్ నేతల ఇళ్లల్లో కూడా రైడ్స్ జరగడం హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల పాటు మంత్రి సబితా బంధువుల ఇళ్లలో దాడులు జరుగగా..పెద్ద ఎత్తున నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు మిర్యాలగూడ బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే భాస్కర్ రావు(MLA Bhaskar Rao) ఇళ్లలో , ఆఫీస్ లలో ఐటీ రైడ్స్ జరుగుతున్న వార్తలు బిఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళనకు గురి చేసాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ రైడ్స్ ఫై నల్లమోతు భాస్కర్ క్లారిటీ ఇచ్చారు. తన ఇంటిపై, తన సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులంటూ జరుగుతున్న ప్రచారం అంతా బూటకమని కొట్టిపడేశారు. జిల్లాలోని పలు చోట్ల ఉన్న రైస్ మిల్లులపై రెయిడ్స్ జరుగుతున్నాయని, ఆ రైస్ మిల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. గురువారం మిర్యాలగూడ మండలం అన్నపురెడ్డిగూడెం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడో వ్యాపారస్తుల మీద రైడ్ జరిగితే నాకేం సంబంధం అని ప్రశ్నించారు. నా బంధువుల పైన గాని, నా కుమారుల ఇంట్లో గానీ ఐటీ సోదాలు జరగట్లేదన్నారు. నాపైన ఐటీ సోదాలు జరిగితే నేనెందుకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని ప్రశ్నించారు. నాకు పవర్ ప్లాంట్లు ఉన్నాయి అన్నది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు.
ప్రస్తుతం మిర్యాలగూడలోని వైదేహీ వెంచర్స్‌తోపాటు రైస్‌మిల్ యజమానులు రంగా శ్రీధర్, రంగా రంజిత్, బండారు కుశలయ్య ఇండ్లలో సోదాలు చేస్తున్నారు. గురువారం ఉదయం 4 గంటల నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఒక్క నల్లగొండలోనే 30 బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
Read Also : Venkatesh : ముంబై లో వెంకీమామ సందడి..క్రికెటర్స్ తో సెల్ఫీలు