Site icon HashtagU Telugu

Marri Janardhan Reddy: సొంత డబ్బుతో స్కూల్ కట్టించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

Marri Janardhan Reddy

Marri Janardhan Reddy

Marri Janardhan Reddy: నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. సొంత డబ్బుతో స్కూల్ కట్టించి ప్రారంభించారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని సిర్శావాడ గ్రామంలో సొంత ట్రస్ట్ ఎంజేఆర్ చారిటబుల్ ఆధ్వర్యంలో 2 కోట్ల 50 లక్షలతో జెడ్పీ ఉన్నత పాఠశాలను కట్టించారు. ఈ భవనాన్ని ఆయన ఈ రోజు ఆదివారం ప్రాంరంభించారు.

మర్రి జనార్దన్ రెడ్డి తాను చదువుకున్న పాఠశాల నిర్మాణ పనులను పర్యవేక్షించడం విశేషంగా భావిస్తున్నానని మర్రి జనార్దన్ రెడ్డి చెప్పారు. ప్రజాసేవ పట్ల తన నిబద్ధతను చెప్తూ..సమాజానికి అవిశ్రాంతంగా సేవ చేస్తూనే ఉంటానని, రాబోయే రోజుల్లో సమాజాభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి 2012లో టీడీపీ నుండి రాజకీయ ప్రవేశం చేశారు. ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ లో చేరారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు.2018 ల్లోనూ పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి పై గెలుపొందారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మర్రి జనార్దన్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

Also Read: Milk Powder Barfi: పాలపొడి బర్ఫీ.. ఇలా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు?