Site icon HashtagU Telugu

Harish Rao: 11 ఏళ్ల కిందటి ఫొటోతో హరీశ్‌రావు ట్వీట్.. వివరాలివీ

Brs Leader Harish Rao Kcr Telangana Bill Telangana History

Harish Rao: ఫిబ్రవరి 18.. ఈ తేదీకి  తెలంగాణ చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. 2014 సంవత్సరంలో ఇదే తేదీన లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించింది. ఆ గొప్ప సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

Also Read : RBIs New Rule: బ్యాంకు బిచాణా ఎత్తేస్తే.. ఖాతాదారులకు ఎంత ఇస్తారు.. కొత్త అప్‌డేట్

ఆ పోస్ట్‌లో ఒక ఫొటోను హరీశ్‌రావు(Harish Rao) జతపరిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును 2014 సంవత్సరం ఫిబ్రవరి 18న లోక్‌సభ ఆమోదించింది. ఆ తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌, హరీశ్ రావు పలువురు బీఆర్ఎస్ అగ్రనేతలు సంబురాలు చేసుకున్నారు. ఆనాడు దిగిన ఫొటోను హరీశ్ రావు తన పోస్ట్‌లో జత చేశారు. ‘‘కేసీఆర్‌  లాంటి గొప్ప దార్శనికత కలిగిన మహా నాయకుడి సారథ్యంలో తెలంగాణ ప్రజా ఉద్యమం విజయం సాధించిన రోజు అది(2014 ఫిబ్రవరి 18)’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రజా ఉద్యమాలు విజయం సాధిస్తాయని ఆ సందర్భం నిరూపించింది’’ అని హరీశ్ రావు చెప్పారు. ‘‘పట్టుదల, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం  చేయొచ్చని నిరూపించిన రోజు అది’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ ఫొటోలో కేసీఆర్, హరీశ్ రావులతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విఠల్ సహా పలువురు నేతలు ఉన్నారు.

Also Read :Gyanesh Kumar : కేంద్ర ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేశ్‌ కుమార్‌.. నేపథ్యమిదీ

చిదంబరం ఫోన్ చేసినా కేసీఆర్ వినలేదు

‘‘2009 డిసెంబరు 9వ తేదీన తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఆనాటి యూపీఏ సర్కారు ప్రకటన చేసింది.  దీక్ష విరమించండి, మేం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని నాటి కేంద్ర మంత్రి చిదంబరం ఫోన్ చేసి కేసీఆర్‌కు చెప్పారు. అయినా కేసీఆర్ వినలేదు. తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వస్తేనే దీక్ష విరమిస్తానని స్పష్టం చేశారు. అప్పటికే 11 రోజులు అయ్యింది. ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. అయినా కేసీఆర్ పట్టు వదల్లేదు. దీక్షను కొనసాగించారు’’ అని సోమవారం రోజు హరీశ్‌రావు గుర్తు చేసుకున్నారు.