BRS Leader Died: ఆత్మీయ సమ్మేళనంలో హఠాన్మరణం, గుండెపోటుతో BRS నేత మృతి!

యువకుల నుంచి పెద్దల వరకు చాలామంది గుండె సమస్యల బారిన పడుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Brs Leader

Brs Leader

ఇటీవల కాలంలో గుండెపోటు, గుండెకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ పెరిగిపోతున్నాయి. యువకుల నుంచి పెద్దల వరకు చాలామంది గుండె సమస్యల బారిన పడుతున్నారు. తాజాగా గుండెపోటుతో ఓ బీఆర్ఎస్ నాయకుడు చనిపోయాడు. తెలంగాణలోని జగిత్యాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. అయితే  తెలంగాణ తల్లి విగ్రహం వద్ద BRS నాయకులు నృత్యాలు చేస్తుండగా బండారి నరేందర్ అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయాడు.

నరేందర్ BRS మహిళ నాయకురాలు, కౌన్సిలర్ బండారి రజని భర్త. సీనియర్ నాయకులు బండారి నరేందర్ మృతితో జగిత్యాలలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన కార్యక్రమాలను రద్దుచేసుకున్నారు. నరేందర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

  Last Updated: 01 Apr 2023, 01:32 PM IST