Site icon HashtagU Telugu

Telangana: రేవంత్ పై హైకమాండ్ కు లేఖ రాసిన దాసోజు శ్రవణ్

Telangana

New Web Story Copy 2023 07 18t174544.667

Telangana: బీఆర్ఎస్ పార్టీ సిట్టింగులకు సీట్లు ఇచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అధికార పార్టీ సిట్టింగులకు సీట్లు ఇచ్చే దమ్ము ఉందా చెప్పాలని, లేని పక్షంలో మీరు ఆడ కాదు ,మగ  కాదు.. మాడా అని వర్ణించారు రేవంత్. అదేవిధంగా సీఎం కెసిఆర్ గజ్వేల్ లో పోటీ చేసే దమ్ముందా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కెసిఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయకుంటే మాడా అని ఒప్పుకోవాలి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 80 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలు గోతులు తొవ్వారని స్పష్టం చేశారు రేవంత్.

రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి బహిరంగ లేఖ పంపాడు. రేవంత్ తన వ్యాఖ్యల్లో ట్రాన్స్‌జెండర్లని అవమానపరుస్తూ మాట్లాడిన నీచుడు అని మండిపడ్డారు. బీసీలని అవమానపర్చే విధంగా మాట్లాడాలని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి కి లైసెన్స్ ఇచ్చిందా అంటూ ప్రశ్నించారు. ట్రాన్స్‌జెండర్లతో పాటు దొమ్మర, వంశరాజులు, యాదవ, గౌడ, మున్నూరు కాపు తదితర బీసీ వర్గాల ప్రజలని కించపరుస్తూ మాట్లాడుతూ దుష్ట రాజకీయాలు చేస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు. మూడు ఎకరాలకు మూడు గంటల కరెంట్ చాలు అని పేద రైతులను అవమానపర్చిన రేవంత్ రెడ్డి చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని చెప్పారు. ఉన్మాద రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి ని సంఘం నుండి బహిష్కరించాలి అమాయక ప్రజలని అవమానిస్తున్న రేవంత్ రెడ్డి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు దాసోజ్ శ్రవణ్.

Also Read: Modi & Yogi: మోడీ, యోగిలకు థ్రెట్, ముంబై పోలీస్ అలర్ట్!