Motkupalli – DK Sivakumar : కాంగ్రెస్‌లోకి మోత్కుపల్లి.. డీకే శివకుమార్‌ తో భేటీ

Motkupalli - DK Sivakumar : కేసీఆర్ పై అలిగిన బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు.

  • Written By:
  • Publish Date - September 29, 2023 / 03:09 PM IST

Motkupalli – DK Sivakumar : కేసీఆర్ పై అలిగిన బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. అసెంబ్లీ టిక్కెట్ ఇస్తానని తనకు హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అంటున్న మోత్కుపల్లి హస్తం పార్టీకి జై కొట్టాలని డిసైడ్ అయ్యారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఇటీవల దీక్ష చేసిన ఆయన.. ఇప్పుడు బెంగళూరుకు వెళ్లి తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని.. అన్ని విషయాలు హైదరాబాద్‌ కు తిరిగొచ్చాక  చెబుతానని మోత్కుపల్లి తెలిపారు. అయితే మోత్కుపల్లికి కాంగ్రెస్ నుంచి తుంగతుర్తి అసెంబ్లీ టిక్కెట్ వస్తుందా ? రాదా ? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

Also read : Rohit Sharma: టీమిండియా కెప్టెన్ కు షాక్.. రోహిత్ శర్మ ఐఫోన్ చోరీ!

తుంగతుర్తి టికెట్ కోసం త్రిముఖ పోరు

ఇప్పటికే  తుంగతుర్తి బీఆర్‌ఎస్ పార్టీ నుంచి మందుల సామేలు కాంగ్రెస్ లోకి వచ్చారు. గత రెండు ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన అద్దంకి దయాకర్ కూడా తుంగతుర్తి టికెట్ రేసులో ఉన్నారు. అద్దంకి దయాకర్.. రేవంత్ రెడ్డికి సన్నిహితుడు అని చెబుతుంటారు. ఇప్పుడు మోత్కుపల్లి కూడా కాంగ్రెస్ లోకి వస్తానని అంటున్నారు. దీంతో తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ కోసం త్రిముఖ పోటీ నెలకొంది. మందుల సామేలు, అద్దంకి దయాకర్, మోత్కుపల్లిలలో ఎవరికి టికెట్ కన్ఫామ్ అవుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

టీడీపీ.. బీజేపీ.. బీఆర్ఎస్.. కాంగ్రెస్

మోత్కుపల్లి రాజకీయ జీవితం టీడీపీలో మొదలైంది. దశాబ్దాల పాటు ఆ పార్టీలో పనిచేశారు. ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని పొందారు. 2009లో తుంగతుర్తి నుంచి పోటీ చేసిన మోత్కుపల్లి పదివేల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొంతకాలం ఆగి.. బీజే‌పీలోకి వెళ్లారు. తర్వాత బీఆర్‌ఎస్ లో చేరారు. అక్కడ ప్రాధాన్యత లేకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ లోకి రావాలని (Motkupalli – DK Sivakumar) చూస్తున్నారు.