Site icon HashtagU Telugu

Grabbing Lands : బీఆర్‌ఎస్ భూ అక్రమాలకు.. రేవంత్ సర్కార్ ప్రక్షాళన!

Brs Government Grabbing Lan

Brs Government Grabbing Lan

తెలంగాణలో గత పదేళ్ల బీఆర్‌ఎస్ (BRS) పాలనలో గ్రామ పంచాయతీల విషయంలోనే కాక, హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన ప్రభుత్వ భూముల విషయంలోనూ తీవ్రమైన అక్రమాలు, దుర్వినియోగం జరిగాయని అధికార పార్టీ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వేల కోట్ల విలువైన భూములను పరిశ్రమల స్థాపన పేరుతో తమ అనుయాయులకు ధారాదత్తం చేశారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్‌కు హైదరాబాద్‌ను అప్పగించిన తర్వాత, నగర పరిధిలో పలు అక్రమాలు జరిగాయని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చివరికి సుప్రీంకోర్టు మరియు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాలను కూడా పట్టించుకోలేదని తెలుస్తోంది. 2013లోనే ఓఆర్‌ఆర్ (ORR) లోపల ఉన్న కాలుష్య కారక (రెడ్, ఆరెంజ్ కేటగిరీ) పరిశ్రమలను బయటకు తరలించాలని ఆదేశాలు ఉన్నా, పదేళ్లపాటు వాటిని అమలు చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. అధికారం కోల్పోయిన తర్వాత, తమ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్‌ఎస్ నేతలు రేవంత్ సర్కార్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ, ఆరోగ్యకరమైన విధానాలపై కూడా విషం జిమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు.

Amaravati : అమరావతికి రాజధాని హోదా.. కేంద్రం సవరణ బిల్లు

బీఆర్‌ఎస్ హయాంలో భూమి దుర్వినియోగం ఎంత తీవ్రంగా జరిగిందనే దానికి పలు ఉదాహరణలు ఉన్నాయి. చాలానగర్లో తమ అనుయాములకు 1.52 ఎకరాలు కేటాయించడం, అలాగే ఐడీఏ బొల్లారం పరిధిలో పలు కంపెనీలకు (భూత్న బురస్ట్రీ, రాజా ఎంటర్‌ప్రైజెస్, హిల్ ల్యాండ్, గల్ఫ్ ఆయిల్ వంటి) పాలసీలను సైతం పాటించకుండా భూములను కేటాయించడం జరిగింది. అజామాబాద్, హఫీజ్‌పేట, కూకట్‌పల్లి, నాచారం వంటి కీలక ప్రాంతాలలో విధి విధానాలు ఖరారు కాకముందే భూ పందేరాలు నిర్వహించారు. పేరుకు కంపెనీలైనా, వాటి వెనుక బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు ప్లాట్లు పంచుకున్నారని తెలుస్తోంది. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని భూములు పొందిన కంపెనీలు పదేళ్లు గడిచినా పనులు ప్రారంభించకపోయినా, వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అంతేకాక 20 ఇండస్ట్రియల్ పార్కులను కన్వర్షన్ చేయాలని హైకోర్టు ఆదేశించినా, వాటిని పట్టించుకోకుండా గైడ్ పాలసీని తీసుకొచ్చి, భూములను ఫ్రీ హోల్డ్‌గా మార్చేందుకు రహస్య జీవోలు జారీ చేశారు. మరోసారి అధికారంలోకి వస్తే ఈ భూములను సొంతం చేసుకునేందుకు బీఆర్‌ఎస్ వేసిన ముందస్తు కుట్రే ఇదంతా అని స్పష్టమవుతోంది.

ఈ భూ అక్రమాలను అరికట్టడానికి మరియు పెరుగుతున్న కాలుష్యం నుంచి నగరాన్ని కాపాడటానికి రేవంత్ సర్కార్ నడుం బిగించింది. ఇందులో భాగంగానే, హిల్ట్ (HILT – హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్) పాలసీని పునరుద్ధరించింది. ఈ పాలసీని రేవంత్ ప్రభుత్వం కొత్తగా తీసుకురాలేదు, 2013కి ముందున్న పాలసీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి అమలు చేస్తోంది. ఈ కొత్త పాలసీ ప్రకారం, ప్రభుత్వం ఎస్ఆర్ (SR) రేటు కంటే ఎక్కువ కన్వర్షన్ ఫీజులను నిర్ణయించింది. దీని లక్ష్యం: భూములు అక్రమంగా చేతులు మారకుండా నిబంధనలను కఠినతరం చేయడం, భూములు దుర్వినియోగం కాకుండా కాపాడటం మరియు ప్రభుత్వానికి ఆదాయం పెంచడం. అక్రమాలు బయటపడేసరికి, బీఆర్‌ఎస్ నేతలు రేవంత్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి మరియు ఆరోగ్యకరమైన విధానాలను తప్పుబడుతూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ కూడా బీఆర్‌ఎస్‌కు తోడై, గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం, మరోసారి ఈ రెండు పార్టీల మధ్య నాటకం బయటపడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి ముందు బీఆర్‌ఎస్ కుట్రలు తేలిపోతున్నాయని స్పష్టమవుతోంది.

Exit mobile version