Site icon HashtagU Telugu

BRS Kokapet : 2నెల‌ల్లో KCR సంపాదన 1500 కోట్లు!

BRS Kokapet

Brs Office

`దీపం ఉండ‌గానే ఇళ్లు చ‌క్క‌బెట్టుకోవాలి` అనేది సామెత. దాన్ని ఫాలో అవుతున్న‌ట్టు ఉన్నారు కేసీఆర్. ఇటీవ‌ల కోకాపేట ప్రాంతంలో పార్టీ ఆఫీస్ కోసం 15 ఎక‌రాల‌ను (  BRS Kokapet ) కేటాయించుకున్నారు. ఆ మేర‌కు క్యాబినెట్ ఆమోదం కూడా ఇచ్చింది. దాన్ని స‌వాల్ చేస్తూ కొంద‌రు కోర్టులో పిల్ వేశారు. ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉంది. ఆ లోపే ఆ భూమిని స్వాధీనం చేసుకుని నిర్మాణ ప‌నుల‌ను కూడా కేసీఆర్ మొద‌లు పెట్టారు. అధికారికంగా శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాల‌ను కేసీఆర్ చేసిన విష‌యం విదిత‌మే.

కోకాపేటలో పార్టీ ఆఫీస్ కోసం 15 ఎక‌రాల‌ను (BRS Kokapet)

పార్టీ కేంద్ర కార్యాల‌యం బంజార‌హిల్స్ లో ఇప్ప‌టికే ఉంది. ఉద్య‌మ స‌మ‌యంలోనే భూమిని తీసుకుని పెద్ద భ‌వ‌నం నిర్మించారు. అక్క‌డ నుంచి టీఆర్ఎస్ కార్య‌క‌లాపాలు న‌డిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ కార్య‌క్ర‌మాలు కూడా అక్క‌డ నుంచే న‌డుస్తున్నాయి. అంతేకాదు, కొత్త‌గా ఏర్ప‌డిన ప్ర‌తి జిల్లాకు ఒక కార్యాల‌యం నిర్మాణం కోసం ప్ర‌భుత్వ భూముల‌ను తీసుకున్నారు. గ్రేట‌ర్ ప‌రిధిలోని రంగారెడ్డి, హైద‌రాబాద్ విభాగాల‌కు ప్ర‌త్యేక ఆఫీస్ ల కోసం విలువైన భూముల‌ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా అవ‌త‌రించిన త‌రువాత 15 ఎకరాల భూమిని కోకాపేట‌లో (BRS Kokapet )ఇటీవ‌ల సొంతం చేసుకుంది. అక్క‌డ హెచ్ ఎండీఏ వేసిన బ‌హిరంగ వేలంలో ఎక‌రం 100కోట్లు ప‌లికింది. అంటే, 1500 కోట్ల విలువైన భూమిని అప్ప‌నంగా కేసీఆర్ మింగేశార‌న్న‌మాట‌.

హెచ్ ఎండీఏ వేసిన బ‌హిరంగ వేలంలో ఎక‌రం 100కోట్లు

ఢిల్లీలోనూ క‌నీస ధ‌ర‌కు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం భూమిని కేంద్రం కేటాయించింది. అదే విష‌యాన్ని కాంగ్రెస్ త‌ర‌చూ ప్రస్తావిస్తోంది. ఒక వేళ బీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య మ్యాచ్ ఫిక్సింగ్ లేక‌పోతే, ఢిల్లీ సెంట‌ర్లో విలువైన భూమిని నామిన‌ల్ ధ‌ర‌కు మోడీ స‌ర్కార్ ఎలా కేటాయిస్తుంద‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప‌లుమార్లు ప్ర‌శ్నించారు. ఇలా, ప్ర‌తి రాష్ట్రంలోనూ పార్టీ ఆఫీస్ ల‌ను ఏర్పాటు చేస్తోన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తాజాగా కోకాపేట‌లో భూముల‌ను తీసుకోవ‌డం ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు దొరికిన అస్త్రంగా మారింది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా పార్టీల‌కు పెట్టుబ‌డి పెడ‌తానంటూ కేసీఆర్ చెబుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, దేశ వ్యాప్తంగా అత్య‌ధిక సంప‌ద క‌లిగిన ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఉంది. ప్ర‌త్యేక విమానం, హెలికాప్ట‌ర్ల‌ను క‌లిగిన సీఎంగా కేసీఆర్ కు పేరుంది.

Also Read : KCR Kokapeta : కోకాపేట `భూ`ధ‌ర‌ల్లో రాజ‌కీయ గేమ్, బినామీ టెండ‌ర్ల‌తో హైప్?

తాజాగా కోకాపేట‌లోని హెచ్ఎండీఏ లేవౌట్ ప‌రిధిలో భూముల బహిరంగ వేలం జ‌రిగింది. అక్క‌డ ఎక‌రం 100కోట్లు ప‌లికింద‌ని కేసీఆర్ స‌ర్కార్ గొప్ప‌గా చెప్పుకుంటోంది. దాన్నే తెలంగాణ అభివృద్ధి కింద ప‌రిగ‌ణిస్తోంది. ఆర్థిక వృద్ధి కోణం నుంచి చూడాల‌ని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెబుతున్నారు. దానికి తెలంగాణ సెంటిమెంట్ ను కూడా జోడించారు. అదే అసెంబ్లీలో ఉన్న మంత్రి కేటీఆర్ తండ్రి కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇదంతా చూస్తుంటే ఈసారి రియ‌ల్ ఎస్టేట్ ధ‌ర‌ల‌ను చూపించ‌డం ద్వారా ఎన్నిక‌ల‌కు కేసీఆర్ వెళ‌తార‌ని తెలుస్తోంది. గ‌త రెండు ఎన్నిక‌ల్లో మంచినీటి కుళాయి, విద్యుత్ స‌ర‌ఫ‌రాను చూపించారు. ఇప్పుడు భూముల ధ‌ర‌ల‌ను చూపిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కోకాపేట‌లో పార్టీ ఆఫీస్ కోసం 15 ఎక‌రాల‌ను కేటాయించుకున్న సంగ‌తిని ప్ర‌త్య‌ర్థులు గుర్తు చేస్తున్నారు. ఇదంతా రియ‌ల్ ఎస్టేట్ మాఫియా పాల‌న అంటూ కాంగ్రెస్ విమ‌ర్శిస్తోంది.

Also Read : KCR Powder : BRS,BJP సూత్రం ఇంచుమించు ఒక‌టే..!