Munugode : మునుగోడు లో బిఆర్ఎస్ కు భారీ షాక్..కాంగ్రెస్ లోకి కీలక నేతలు

బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వారిలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, నాంపల్లి జెడ్పీటీసీ ఏలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, మునుగోడు జడ్పీటీసీ నారబోయిన స్వరూప రవి, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి

  • Written By:
  • Publish Date - November 6, 2023 / 11:35 PM IST

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వలసల పర్వం ఇంకాస్త ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ (BRS) నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ (Congress) గూటికి చేరుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన నేతల దగ్గరి నుండి ఇతర పార్టీల నేతలు సైతం కాంగ్రెస్ లో చేరుతూ..కాంగ్రెస్ బలం పెంచడమే కాదు ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నారు. తాజాగా మునుగోడు (Munugode ) లో అధికార పార్టీ బిఆర్ఎస్ భారీ షాక్ తగిలింది. కీలక నేతలంతా పార్టీకి రాజీనామా చేసి..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వారిలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, నాంపల్లి జెడ్పీటీసీ ఏలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, మునుగోడు జడ్పీటీసీ నారబోయిన స్వరూప రవి, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి, నాంపల్లి వైసీపీ ఎంపీపీ పానుగంటి రజిని వెంకన్న గౌడ్, మునుగోడు వైస్ ఎంపీపీ అనంత వీణా లింగస్వామి గౌడ్ తదితరులు ఉన్నారు. వీరంతా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైఖరి నచ్చకనే పార్టీ కి గుడ్ బై చేసినట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె సోమవారం రాత్రి కాంగ్రెస్ అధిష్టానం మూడో జాబితాను విడుదల చేసింది. 16 మందితో కూడిన లిస్ట్ ను రిలీజ్ చేసారు. ఇక కామారెడ్డి నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండగా.. వనపర్తి, బోథ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. వనపర్తి నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత జీ చిన్నారెడ్డి స్థానంలో తుడి మేఘా రెడ్డి పేరును, ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి ఆదే గజేందర్ అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ ఖరారు చేసింది. ఇంతకుముందు బోథ్ నుంచి వన్నెల అశోక్‌కు టికెట్ కేటాయించారు. ఇక సూర్యాపేట, తుంగతుర్తి స్థానాల్లో అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది.

Read Also : Telangana Congress 3rd List : కాంగ్రెస్ మూడో జాబితా వచ్చేసింది..కామారెడ్డి బరిలో రేవంత్