Case Against CM Revanth: తెలంగాణలో రాజకీయాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు (Case Against CM Revanth) చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమైనట్లు సమాచారం. ఈరోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌పై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో అసలు మద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని పెట్టాలని బీఆర్ఎస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనుంది. కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలకు ఈ కేసుతో సంబంధం లేదని బీఆర్ఎస్ అంటోంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టబడులు వెనక్కి పోయాయని కూడా ఫిర్యాదు చేయనున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చినట్లు బీఆర్ఎస్‌కు గుర్తు చేస్తున్నారు.
Also Read: Velupillai Prabhakaran : త్వరలోనే జనం ముందుకు ఎల్టీటీఈ ప్రభాకరన్.. నిజమేనా ?
ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి నేడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి మండల పరిధిలోని ప్రొద్దటూర్‌లో 150ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియం పార్క్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్‌తో పాటు ఈ కార్యక్రమానికి చిరంజీవి కూడా హాజరుకానున్నారు. రూ. 450కోట్ల వ్యయంతో రామ్‌దేవ్ రావు ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కులో 85 దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలు, చెట్లను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం రేవంత్ సాయంత్రం 4 గంటలకు మైనింగ్ విభాగంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు పర్యాటక శాఖపై సమీక్ష చేపట్టనున్నారు.