Site icon HashtagU Telugu

CM KCR: బీఆర్‌ఎస్‌ అంటే భయమెందుకు: సీఎం కేసీఆర్

CM KCR

New Web Story Copy 2023 06 27t165151.514

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిన్న సోమవారం ఆయన కీలక నేతలతో రోడ్డు మార్గాన మహారాష్ట్రకు పయనమయ్యారు. దాదాపు 600 కార్లలో ఆయన అనుచర వర్గం మహారాష్ట్రకు బయలుదేరింది. ఇక కెసిఆర్ పర్యటనలో భాగంగా విపక్షాలు బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డాయి. బీఆర్ఎస్ మహారాష్ట్రలో ఎలాంటి ప్రభావం చూపలేదని, కెసిఆర్ బీజేపీకి బీ టీమ్ లా పనిచేస్తున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా సీఎం కెసిఆర్ విపక్షలపై సెటైరికల్ కామెంట్స్ చేశారు.

మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం కెసిఆర్ మాట్లాడుతూ..మహారాష్ట్ర రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టినప్పటికీ రాష్ట్రంలోని పార్టీలు బీఆర్‌ఎస్‌కు ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు. మేం బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్, కాంగ్రెస్ ఏ టీమ్ అని బీజేపీ అంటోంది. మేము ఎవరితో పొత్తుకు సిద్ధంగా లేమని, బీఆర్ఎస్ కేవలం రైతులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలతోనే మా పొత్తు అన్నారు కెసిఆర్. ఈ సభలో కేసీఆర్ తెలంగాణాలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు.

షోలాపూర్‌ బహిరంగ సభలో కెసిఆర్ ఆధ్వర్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) మాజీ నేత భగీరథ్ భాల్కే బీఆర్ఎస్ లో చేరారు. ఈ నియోజకవర్గం నుంచి భగీరథ భాల్కేను గెలిపించాలని కోరారు సీఎం కెసిఆర్. బాల్కే ఎమ్మెల్యే అయితే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.

Read More: Ivf Clinic Cheat : భర్తకు బదులు మరో వ్యక్తి స్పెర్మ్ తో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్