Site icon HashtagU Telugu

Kaleswaram Scam: కవిత నోటి దూల.. సీఎం రేవంత్ యాక్షన్ ప్లాన్

Kaleswaram Scam: శాసన మండలిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి చోటుచేసుకుందని పలు విమర్శలు చేశారు. దీనిపై కవిత స్పందిస్తూ.. అవసరమైతే ఈ ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని అన్నారు. దీన్ని వ్యూహంగా తీసుకుని తనకు అనుకూలంగా మార్చుకున్న రేవంత్.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించారు.

కవిత మాటలను సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాడు. ఈ నేపథ్యంలో ఆమె కోరిక మేరకు ఈ ప్రాజెక్టును పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రత్యేక బస్సుల్లో అందరం కలిసి మేడిగడ్డ వెళ్దామని ప్రభుత్వం పేర్కొనడంపై కవిత సెటైరికల్ పేల్చారు. ఇది టూరిస్ట్ స్పాట్ కాదని, ఏమైనా లోపాలుంటే విచారణ చేయాలని అన్నారు. దీనిపై వెంటనే స్పందించిన రేవంత్.. కవిత అభ్యర్థన మేరకు కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు.

గతంలో ఈ అంశంపై రేవంత్ చాలా స్పష్టంగా మాట్లాడారు. కాళేశ్వరం ద్వారా బీఆర్ఎస్ పెద్దలకు భారీగా లబ్ధి చేకూరిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై విచారణ జరిపిస్తామని రేవంత్ ప్రకటించారు. అనుకున్నట్టే రేవంత్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. పైగా కవిత రెచ్చగొట్టే వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారాయి.

Also Read: Nuzvid IIIT : సముద్రంలో కొట్టుకుపోయిన ఐదుగురు స్టూడెంట్స్.. నలుగురు సేఫ్

Exit mobile version