BRS : మహారాష్ట్ర బరిలో బీఆర్ఎస్…సక్సెస్ అవుతారా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు రెడీ అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - October 8, 2022 / 08:47 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా పక్క రాష్ట్రాలపైన ఏపీ, కర్నాటక, మహారాష్ట్రాలపై కేసీఆర్ గురిపెట్టారని..కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో చేరికలు ఎక్కువగా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవాలని కేసీఆర్ చూస్తున్నారు. 2023చివరిలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీకి మద్దతు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో పోటీ చేస్తారని ఇప్పటికే మాజీ సీఎం కుమారస్వామి క్లారిటీ ఇచ్చారు.

అయితే కేసీఆర్ మాత్రం మహారాష్ట్రపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే గడ్చిరోలీ, నాందేడ్, పర్చానీ జిల్లాలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టారట. ఈ రెండు నెలల్లో మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈలోపు బీఆర్ఎస్ కు ఈసీ క్లియరెన్స్ ఇచ్చినట్లయితే..అక్కడ పోటీ చేసేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. గంజ్ గావ్, కార్ల గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని స్థానిక కలెక్టర్ కు గతంలో వినతి పత్రాలు ఇఛ్చారు. తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ పథకాలు కావాలంటూ కోరారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏర్పాటుతో ఆయా గ్రామాల ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. మొత్తానికి కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.