Site icon HashtagU Telugu

Deeksha Diwas 2023: కేటీఆర్ రక్తదానం, ఎన్నికల ఉల్లంఘన?

Deeksha Diwas 2023

Deeksha Diwas 2023

Deeksha Diwas 2023: బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ లో ‘దీక్షా దివస్’ సందర్భంగా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు.

సీఎం కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం నవంబర్ 29, 2009న నిరాహార దీక్ష ప్రారంభించారు. దీని జ్ఞాపకార్థమే ఈ రోజు దీక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయితే రేపు నవంబర్ 30 రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా నగరంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున బహిరంగ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలన్న పార్టీ విజ్ఞప్తిని హైదరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య తిరస్కరించారు. అయితే కేటీఆర్ పార్టీ కార్యాలయాన్ని సందర్శిస్తే పోలీసులకు ఎలాంటి అభ్యంతరం లేదని సందీప్ శాండిల్య బీఆర్‌ఎస్ క్యాడర్‌తో చెప్పినట్లు సమాచారం.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించారంటూ పార్టీ కార్యాలయంలో కేటీఆర్‌ను మీడియా ప్రశ్నించగా అలాంటి ఉల్లంఘన ఏమి జరగలేదని కేటీఆర్ అన్నారు. పార్టీ కార్యనిర్వాహక కార్యకర్తగా, పార్టీ కార్యాలయంలో పార్టీ క్యాడర్‌తో కలిసి పనిచేసేందుకు నాకు అర్హత ఉంది. నాకు సంబంధించినంత వరకు ఎలాంటి ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు.

Also Read: Paruthiveeran Issue: అమీర్ VS జ్ఞానవేల్.. సారీ చెప్పాలని డైరెక్టర్ భారతీరాజా డిమాండ్