Site icon HashtagU Telugu

Budvel Lands: కోట్లు కురిపించిన కోకాపేట, బుద్వేల్ భూములపై బీఆర్ఎస్ ప్రభుత్వ కన్ను!

Budvel

Budvel

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రియల్ భూంకు అడ్గాగా మారింది. ప్రధాన రహదారులు, విశాలమైన స్తలాలు ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతోంది. ఈ అంశాలే తెలంగాణ ప్రభుత్వానికి వరంగా మారాయి. హైదరాబాద్ – కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధరలు వచ్చిన తరుణంలో అదే తరహాలో బుద్వేల్ భూముల అమ్మకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని ద్వారా విక్రయించనున్నారు. ప్లాట్ల విస్తీర్ణం 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల వరకు ఉంది. బుద్వేల్ భూముల అమ్మకం కోసం ఈ నెల 10వ తేదీన ఈ -వేలం నిర్వహిస్తారు. బుద్వేల్ భూములకు ఎకరాకు 20 కోట్ల కనీస ధరను నిర్ణయించారు.

కోకాపేటలో భూముల్ని వేలం వేయడానికి ప్రభుత్వం 2020లోనే ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా 49.92 ఎకరాల భూమిని వెంచర్ గా మార్చే ప్రక్రియ ప్రారంభించింది. ఈ వెంచర్ కు నియోపొలిస్ అనే పేరుపెట్టింది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రాపర్టీ ఇది. అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కోకాపేటకు రావాలంటే భారీ ట్రాఫిక్ దాటాల్సి ఉంటుంది.

ఈ సమస్యను గుర్తించిన హెచ్ఎండీఏ దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టి, ట్రంపెట్ రూపంలో ప్రత్యామ్నాయం ఏర్పాటుచేసింది. దీని వల్ల ఎయిర్ పోర్ట్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా నేరుగా వెంచర్ లోకి వచ్చే వీలుంది. దీంతో ఈ భూములకు రేటు అమాంతం పెరిగింది. 2021లో పేజ్-1లో ఎకరాకు గరిష్టంగా 35 కోట్ల రూపాయలు అంచనా వేయగా.. 60 కోట్ల రూపాయలకు పైగా పలికింది. ఈసారి 80 కోట్ల రూపాయలు అంచనా వేయగా, 100 కోట్ల రూపాయలకు పైగా పలికింది.

Also Read: Allu Arjun: అల్లు వారి ఇళ్లు అదరహో.. బన్నీ ఇళ్లు నిజంగా ఇంద్రభవనమే!